నారద వర్తమాన సమాచారం
బాధ్యతాయుతంగా జవాబు దారితనంతో బాలల హక్కులను పరిరక్షించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి
నరసరావుపేట రూరల్ లింగంగుంట్ల రాజుపాలెం వాటర్ ట్యాంకు దగ్గర ఎంపీపీ స్కూల్ నందు 32 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు నాణ్యమైన విద్యను నాణ్యమైన ఆహారంను అందిస్తున్న తరుణంలో బాలల భద్రత ప్రశ్నార్థకంగా తయారైందని రైల్వే ట్రాక్ ప్రక్కన ఇరవై అడుగుల దూరంలో టాయిలెట్స్ పక్కన సేఫ్టీ వాలు లేనందువల్ల ప్రమాదం పొంచి ఉన్నట్లు గుర్తించారు దీనిపై స్పందించిన కమిషన్ జిల్లా విద్యాశాఖ అధికారికి 15 రోజుల్లో సేఫ్టీ వాళ్ళు నిర్మించాలని పిల్లల రక్షణకు భద్రతకు తత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం అంగన్వాడి సెంటర్లను తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్నటువంటి టి హెచ్ ఆర్ టేక్ హోమ్ రేషన్ సక్రమంగా అందుతుందా లేదా అని తల్లులను అడిగి తెలుసుకున్నారు.
గర్భవతులకు బాలింతలకు టి హెచ్ ఆర్ సంజీవని కిడ్స్ అందించారు. పి పి వన్ పిపి2 పిల్లలు రైన్స్ పిల్లల్లో సృజనాత్మక పెంచే విధంగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.
టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన పిల్లలందరూ కూడా కేజీబీవీ గురుకులంలో ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కుందేలాగా చర్యలు తీసుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశించారు.బాల్యవివాహాలను నిర్మూలించాలని దానిలో భాగంగా ఏ ఒక్కరు కూడా బడి బయట పిల్లలు ఉండకూడదని ఆర్ టి ఈ యాక్ట్ ప్రకారం బడిలోనే ఉండాలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా బాలల హక్కులను పరీక్షించే విధంగా స్కూల్లో అడ్మిషన్లు తీసుకునేలాగా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు.
అలానే బాలల సంరక్షణ విభాగం జీవో ఎంఎస్ వన్ ప్రకారం జిల్లాలో ప్రతి గ్రామంలో బాలల సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు బాలల స్నేహపూరిత ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు
ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఉమామహేశ్వరి, డిసిపిఓ, డి శౌరి, డిసిపిఓ, రేవతి, సూపర్వైజర్ పార్వతి ప్రధానోపాధ్యాయుడు మూర్తి,, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.