నారద వర్తమాన సమాచారం
ఇంద్రకీలాద్రి గుడి ఈవో రామ్ చంద్ర మోహన్ ఆకస్మిక తనిఖీ
విజయవాడలోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆదివారం ఈవో రామ్ చంద్ర మోహన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయం లో సెక్యూరిటీ సదుపాయా ల లోపం కనిపించడంతో ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ఏఈఓ చంద్రశేఖర్‌ను క్లూ లైన్ల పరిశీలన సమయంలో కనిపించకపోవడంతో ఆయనకు చార్జ్ మెమో జారీ చేశారు.
అంతేకాదు, అంతరాలయం ఎదుట ఉన్న హుండీని తొలగించాల్సిందిగా రెండుసార్లు ఆదేశించినా అధికారులు పట్టించుకోక పోవడాన్ని ఈవో తప్పు బట్టారు.రద్దీ సమయాల్లో రూ.500 టికెట్లను నిలిపి వేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను సిబ్బంది అమలు చేయకపోవడంపై కూడా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సిబ్బందిపై ఆగ్రహించి వారిని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ కూడా పాల్గొన్నా రు. ఆలయ అధికారుల పనితీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను ఆయన హెచ్చరించారు.
ఈ తనిఖీలు ఆలయ పరిపాలనపై పెద్ద చర్చకు దారి తీసే అవకాశముంది. భక్తుల భద్రత, విశ్రాంతి మరియు సేవల పరంగా ఆలయ సిబ్బంది మరింత బాధ్యతగా వ్యవహరించా ల్సిన అవసరం ఉంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.