నారద వర్తమాన సమాచారం
మాచవరం మండలం చెన్నాయ్ పాలెం గ్రామంలో ఘనంగా ఎమ్.పీ.పీ. స్కూల్ యానివర్స్ డే
చెన్నాయ్ పాలెం :-
మాచవరం మండలం చెన్నయ్యపాలెం గ్రామం నందు ఎంపీ పీ స్కూల్లో ఈరోజు ఘనంగా యానివర్స్ డే జరుపుకున్నారు.
స్కూల్ హెచ్ ఎమ్ రాంబాబు ఆధ్వర్యంలో పిల్లలు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు. నిర్వహించారు.
ఈ సందర్భంగా స్కూల్ హెచ్ ఎమ్ రాంబాబు మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్ కి దీటుగా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఐఐటి పౌండేషన్ నేర్పిస్తున్నామని అలాగే 100% ఇంగ్లీష్ మీడియం మరియు ప్రతిరోజు పిల్లలకు నాణ్యమైన భోజనము వారానికి గుడ్లు వేరుశెనగ చెక్కిలు రాగి జావా ప్రతి విద్యార్థికి మూడు జతల ఉచిత యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ స్కూలు నందు ఇస్తున్నామని అన్నారు.
విద్యార్థిని విద్యార్థుల కొరకు విశాలమైన తరగతి గదులు ఆట స్థలము ప్రతిరోజు యోగా వ్యాయామం, ఆటలు నేర్పుతున్నామని అన్నారు.
కార్పొరేట్ స్కూల్లో కన్నా దీటుగా పరిశుభ్రమైన టాయిలెట్లు నిర్వహణ పాఠశాలలో స్వచ్ఛమైన ప్యూరిఫైడ్ త్రాగునీరు సదుపాయము పూర్తిగా విద్యుతీకరించబడిన ఆర్సిసి బిల్డింగు నెలకు ఒకసారి విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు ప్రతి సంవత్సరము ఉచితంగా ఐరన్ పోలిక్ మాత్రలు ఆల్బైడ్ జోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నామని అన్నారు.
100/ పర్సెంట్ ట్రైన్డ్,గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులచే బోధన పిల్లలకు ఆనందమైన ఆరోగ్యము ఒత్తిడి లేని చదువులు ప్రోత్సహిస్తున్నామని అన్నారు.
మరియు 2025 -2026 వ సంవత్సరానికి గాను ఒకటి నుండి అయిదు తరగతుల వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయి అని మరియుఈనెల 21వ తారీకు నుంచి 23వ తారీకు వరకు డోర్ క్యాంపెయిన్ నిర్వహించబడునని అన్నారు.
ఈ కార్యక్రమంలో చెన్నై పాలెం గ్రామ సర్పంచ్ బొగ్గవరపు అంజయ్య మరియు గ్రామ ప్రతినిధులు,పేరెంట్స్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.