నారద వర్తమాన సమాచారం
కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లి దారి తప్పిన ఫ్యామిలీని రక్షించి సురక్షిత ప్రాంతానికి చేర్చిన మాచర్ల పోలీసులు
మాచర్ల:-
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం గ్రామoకు చెందిన కొడమంచిలి శ్రీను…. శ్రీను వెంకట్ /సన్నాఫ్ నాగేశ్వరరావు, అతని భార్య అయిన కొడమంచిలి ధనలక్ష్మి ఇద్దరు చేపలు పట్టే పని కోసం పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం జెండా పెంట గ్రామం దగ్గర మర్రిచెట్టు ముండే ప్రాంతం దగ్గరకు ఏప్రిల్ 19 వ తేదీన వచ్చినారు. వేటకు కృష్ణ నదిలో వెళ్లి ది.02.05.2025వ తేదీన ఉదయం 07.00 గంటలకు దారి తప్పి,
రాత్రంతా నీరు, ఆహారం లేకుండా కొత్తపుల్లారెడ్డి గూడెం అడవుల్లో ఉండి, దారి తెలియకపోవడంతో మరుసటి రోజు ఉదయం అనగా ఈ రోజు 03.05.2025వ తేదీన ఉదయం 09.00 గంటలకు డయల్ 100 కు ఫోన్ చేయగా, పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మాచర్ల రూరల్ సి ఐ ఎస్ కె . నఫీష్ బాష మరియు వెల్దుర్తి ఎస్ఐ అయిన ఎస్.కె .సమందర్ వలి వెంటనే స్పందించి, వారి యొక్క ఫోను లొకేషన్ తెలుసుకొని, సిబ్బంది సహాయంతో వారి యొక్క జాడని కనుక్కొని, వారిని అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి చేర్చారు . వెంటనే స్పందించి తమ ప్రాణాలు కాపాడి సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చిన పల్నాడు జిల్లా పోలీసు వారికి బాధితులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.