నారద వర్తమాన సమాచారం
నీట్ ఎగ్జాం కేంద్రాల వద్ద పటీష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్
నరసరావుపేట:-
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్ష కేంద్రాల ఏర్పాట్ల గురించి తెలిపిన జిల్లా ఎస్పీ..
భద్రత ఏర్పాట్లు తీసుకోవలసిన చర్యలపై పోలీసు అదికారులకు దిశ నిర్ధేశం.. ఎస్పి
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలి..
ది.04.05.2025 వ తేదీ ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్ష జరుగనున్న సంధర్భంగా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐ పీ యస్ పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అదికారులను ఆదేశించారు.
ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్ష జరుగనున్న కేంద్రాలను అనగా జె ఎన్ టి యు కె ఇంజనీరింగ్ కళాశాల(కాకాని), పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం(ఇర్లపాలెం) పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పల్నాడు జిల్లాలో నీట్ పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులకు కేంద్రంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సమయానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉండే జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు పరీక్షలు ముగిసే వరకు తెరవడానికి వీలులేకుండా చర్యలు తీసుకోవాలి.
అభ్యర్థులను నిర్దేశించిన సమయం లోపు మరియు పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోనికి అనుమతించాలి.
సెల్ ఫోన్లు ,స్మార్ట్ వాచెస్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరాదన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున అభ్యర్థులను మరియు అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది మినహా ఇతరులను అనుమతించరాదని సూచించారు.
అవసరమైతే పరీక్షా కేంద్రాల చుట్టుప్రక్కల డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసుకోవాలన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా బందోబస్తు విధులు నిర్వహించాలి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.