నారదా వర్తమాన సమాచారం
ఎయిర్‌లైన్స్ కీలక ప్రకటన..
ఆ ప్రాంతాల్లో విమానాశ్రయాలు బంద్
న్యూఢిల్లీ, మే 7: ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడికి దిగింది. పాకిస్తాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న నిషేధిత జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-తోయిబా మరియు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్‌ను నిర్వహించింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్‌లో దాదాపు 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సాయుధ దళాలు క్షిపణి దాడులు చేస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు విమానాశ్రయాలు మూతబడ్డాయి. అనేక విమానాలు రద్దు అయ్యాయి. శ్రీనగర్ సహా ఉత్తర భారతదేహంలోని కొన్ని విమానాశ్రయాల్లో కార్యకాలపాలను మూసివేశారు.
పాకిస్థాన్ ఉగ్రశిబిరాలపై భారత సైన్యం దాడుల తర్వాత ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ ముఖ్య ప్రకటనను విడుదల చేశాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టాయి.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్ స్టేషన్లకు బయలు దేరే అన్ని విమానాలను ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. అలాగే అమృత్‌సర్‌కు వెళ్తున్న రెండు అంతర్జాతీయ విమానాలను ఢిల్లీకి మళ్లించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.