నారద వర్తమాన సమాచారం
హైదరాబాద్ లో కఠిన ఆంక్షలు:సీపీ సీవీ ఆనంద్!
హైదరాబాద్ నగరంలో బాణాసంచా కాల్చడంపై పోలీసులు నిషేధం విధిం చారు. పెళ్లిళ్లు, పండుగలు, షాపుల ప్రారంభోత్సవాలు వంటి ఏ సందర్భంలోనైనా సరే బాణాసంచా కాల్చడం పై నిషేధం ఉంటుందని తెలిపారు.
బాణాసంచా అమ్మేవారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. బాణాసంచా కాల్చి తే జైలుకు పంపుతామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నిషేధానికి ప్రధాన కారణం దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే. హైదరా బాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం….
దేశంలో యుద్ధ వాతా వరణం నెలకొనడం, నగరంలో భద్రతా చర్యలు కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బాణాసంచా శబ్దాలు పేలుళ్లుగా అన్వయించు కునే ప్రమాదం ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొనే అవకాశం ఉంది.
ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించవచ్చు. అంతేకాకుండా, బాణాసం చా శబ్దాలు భద్రతా దళాలపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తాయి. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో, బాణాసంచా కాల్చడం వల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే స్పందించడం కష్టమవుతుందన్నారు.
మరోవైపు నగరవ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మొహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
సిపి సివీ ఆనంద్,భద్రతను ఎప్పటి కప్పుడు పర్యవే క్షిస్తున్నారు. బందోబస్తు పై పోలీసులకు సూచనలు ఇస్తున్నారు. ప్రజలు ఎలాంటి బయబ్రాంతులకు గురి కావద్దని ప్రజలకు ఆయన భరోసా కనిపిస్తు న్నారు. అలాగే నగరంలో అనుమానాస్పద వ్యక్తులపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు.
ఈ ఆదేశాలను ఉల్లంఘిం చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ నిషేధా జ్ఞలు తదుపరి ఆదేశాల వరకు కొనసాగుతాయని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.