Sunday, July 20, 2025

యువకులపై తెనాలి పోలీసుల జూలుం….!

నారద వర్తమాన సమాచారం

యువకులపై తెనాలి పోలీసుల జూలుం….!

అమాయక దళిత, మైనారిటీల యువకులపై తెనాలి ఐతానగర్ నడిరోడ్డులో అందరూ చూస్తుండగా పోలీసుల జులుం!

భయభ్రాంతులకు గురవుతున్న తెనాలి ఐతానగర్ ప్రజలు!

ఆలస్యంగా ఆధారాలతో వెలుగులోకి వచ్చిన వీడియో!

కంప్లైంట్ ఇచ్చిన పోలీసు కానిస్టేబుల్ కన్నా చిరంజీవి PC: 6068 :

కన్నా చిరంజీవి తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతనికి 2 టౌన్ కి సంబంధం లేదు. పోలీసు కానిస్టేబుల్ PC: 6068 కన్నా చిరంజీవి 2 టౌన్ పరిధిలోకి వచ్చి ఈ యువకులను డబ్బులు ఇవ్వమని లేకపోతే మీ మీద అక్రమ కేసులు, గంజాయి కేసులు పెడతామని 3 టౌన్ CI రమేష్ బాబు గారు చెప్పమన్నారని బెదిరించగా వాళ్ళు డబ్బులు ఇవ్వమని తిరస్కరించగా అందుకు ఆక్రోశించిన కానిస్టేబుల్ కన్నా చిరంజీవి ఎక్కడ అతని యొక్క అవినీతి బయటకు వస్తుందేమోనని ముందుగానే వెళ్లి ఈ యొక్క యువకులపై అబద్ధపు కేసు పెట్టినాడు. ఈ విధంగా 2 టౌన్ నకు సంబంధం లేని 3 టౌన్ కానిస్టేబుల్స్ బెదిరింపులకు గురిచేసినారు.

Cr.No: 52/2025 గా నమోదు చేసి 3 రోజులు వారి వద్దే ఉంచుకుని చిత్రహింసలకు గురిచేసినారు.

ది. 25-04-2025 నే ముద్దాయిలను అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించి విచక్షణారహితంగా కొట్టి వీధి వీదులు తిప్పుతూ తెనాలి, ఐతానగర్ ప్రధాన కూడళ్ళలో రోడ్డులపై కూర్చోబెట్టి బహిరంగ ప్రదేశాలలో ప్రజలు చూస్తుండంగా విచక్షణారహితంగా తెనాలి 2 టౌన్ రాముల నాయక్ మరియు 3 టౌన్ CI రమేష్ బాబు లు దాష్టీకం ప్రదర్శించారు.

చేబ్రోలు జాన్ విక్టర్ S/O ఇజ్రాయెల్, 25 సంవత్సరాలు, మాల, చెంచుపేట, తెనాలి టౌన్, గుంటూరు జిల్లా.

షేక్ బాబులాల్ @ కరిముల్లా @ కల్లా S/O అమీర్ భాషా, 21 సంవత్సరాలు, ముస్లిమ్, తిప్పర్ల బజార్ మంగళగిరి, గుంటూరు జిల్లా.

దోమా రాకేష్ S/O వాసు, 25 సంవత్సరాలు, మాల ఐతానగర్, తెనాలి టౌన్, గుంటూరు జిల్లా.

అను వారలపై, వీరు ఇద్దరు మాల కులం, ఒకరు ముస్లిమ్ కమ్యూనిటీకి చెందిన యువకులపై తెనాలి 2 టౌన్ CI రాములు నాయక్ మరియు 3 టౌన్ CI రమేష్ బాబు లు అతిక్రూరంగా బహిరంగంగా రోడ్లు మీదకు తీసుకొచ్చి విచక్షణారహితంగా కొట్టినారు. దోమ రాకేష్ అను అతనికి చేతులలో కాళ్ళలో రాడ్లు ఉన్నాయని చెప్పి కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా 2 టౌన్ CI రాములు నాయక్ అతి కర్కశంగా అతని కాళ్ళపై ఎక్కి తొక్కి పెట్టగా 3 టౌన్ CI రమేష్ బాబు అతికిరాతకంగా అతనికి అలుపు వచ్చే వరకు విచక్షణారహితంగా కొట్టినారు. పోలీసు స్టేషన్ లో ముద్దాయిలను కొడతారని చంపుతారని తెలుసుగాని ఈ విధంగా బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగా రోడ్ల మీదకు తీసుకొచ్చి వాళ్ళయొక్క పోలీసు దాష్టీకం ప్రదర్శించి చుట్టుప్రక్కల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినారు.

నేరం చేస్తే న్యాయస్థానాలకు అప్పచెప్పాలి గాని, ఇంత క్రూరంగా ప్రజలు చూస్తూ ఉండగా కొట్టాల్సిన అవసరం లేదు. గౌరవ న్యాయస్థానాలు ముద్దాయిలను ఈ విధంగా శిక్షించవద్దు. ఈ విధంగా కొట్టవద్దు. కొట్టే హక్కు మీకు లేదు అని చెప్పిననూ పెడచెవిన పెట్టి ఈ విధంగా ప్రజలపై తెనాలి పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు.

ఈ విషయం మీద తల్లిదండ్రులు వెళ్ళి మాట్లాడితే ఇంకా వారికి సంబంధించిన వ్యక్తులు వెళ్ళి మాట్లాడినా మీపైన కూడా కేసులు పెడతామని వాపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అండదండలు చూసుకుని పోలీసులు జులుం చూపిస్తున్నారు. ఈ విధమైన దాష్టీకం కేవలం దళితుల మీదే చూపిస్తున్నారు. 2 టౌన్ CI రాముల నాయక్ ఐతనగర్ కు చెందిన వారిపైనే ఎక్కువగా దృష్టి సారించారు. అమాయకపు వ్యక్తులపై అబద్ధపు మరియు అక్రమ కేసులు బనాయించి ఈ విధంగా కర్కశత్వం చూపిస్తున్నారు. 3 టౌన్ CI రమేష్ బాబు నకు ఏ సంబంధం లేకపోయినా ఐతానగర్ 2 టౌన్ కు సంబంధం లేని 3 టౌన్ CI ఈ 2 టౌన్ పరిధిలోకి వచ్చి ఎక్కడా ముద్దాయిలను కొట్టవలసిన అవసరం పని లేదు. ఈ చర్యలపై ప్రజలు చాలా అసహనంగా ఉన్నారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి బాధితులు వెళ్ళడానికి కూడా భయపడేలా చేస్తున్నారు. ఒకవైపు గౌరవ న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఫ్రెండ్లీ పోలీసింగ్ జరపమని చెప్తున్నా ఎక్కడన్నా కూడా అటువంటి పరిస్థితులు కనబడడం లేదు. ఇప్పుడున్న సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రబలంగా వున్నా కూడా పోలీసు వారు బహిరంగంగా ముద్దాయిలను తీసుకువచ్చి కొడుతున్నారు అంటే కేవలం ఒక తెనాలి ఐతానగర్ ప్రదేశాన్ని ఎన్నుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతోటే ఇలాంటి చర్యలకు గురిచేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.

ఇప్పటికైనా పోలీసులు మీ పైఅధికారుల మరియు రాజకీయ నాయకుల మెప్పులు పొందడానికి అమాయకమైన దళిత, మైనారిటీలపై మీ జులుం చూపిస్తున్నారు. వేరే అగ్రకుల లేక రాజకీయ నాయకులకు లోబడి ఉన్న వ్యక్తులను యదేచ్ఛగా వదిలేస్తున్నారు. వారు చేసే అక్రమాలకు మీరు తోడ్పడుతున్నారు. ఒక దళితులు, మైనారిటీల పైనే పోలీసులు జులం సాగిస్తున్నారు.

ఈ విధంగా కానిస్టేబుల్స్ వారికి ఇష్టమైన వారి చేత గంజాయి, మత్తు పదార్థాలు యదేచ్ఛగా కానిస్టేబుల్స్ కనుసన్నలలో అక్రమ రవాణా విక్రయాలు జరుగుతున్నాయి!

పేకాట, జూదం, వ్యభిచారం, గంజాయి వీరి కనుసన్నలలోనే జరుగుతున్నాయి. ఇవన్నీ
పైఅధికారులకు తెలుసు. వీరు కేవలం డబ్బులు ఇచ్చుకోలేని అమాయక ప్రజలపై అక్రమ కేసులు, అబద్దపు కేసులు బనాయించి విచక్షణారహితంగా కొట్టుచున్నారు.

ఈ విషయం మీద మీరు మీ చర్యలు మానుకుని ప్రజలకు దగ్గరగా ఉండి స్నేహపూర్వకంగా వ్యవహరించమని ప్రజలు కోరుతున్నారు. దీని మీద ప్రజా సంఘాలు, మైనారిటీ సంఘాలు, కుల సంఘాలు అంతా కూడా పెద్దయెత్తున ప్రతిఘటించగలరు!


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version