నారద వర్తమాన సమాచారం
రాజుపాలెం మండల్ ఇనుమెట్ల గ్రామం లో కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు….
పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ శ్రీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం:6::00సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధి లో రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధి లోనిఇనుమెట్ల లోసత్తెనపల్లి DSPకృష్ణ చైతన్య పర్యవేక్షణలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు,సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం నందు పోలీసు అధికారులను మరియు సిబ్బందిని బృందాలుగా విభజించి రౌడీ షీటర్లు,ట్రబుల్ మాంగర్స్,పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా… ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీ లలో ఇనుమెట్ల గ్రామం లో * నందు సరైన పత్రాలు లేని
ద్విచక్ర వాహనాలు – 36
ఆటో – 0
స్వాధీనం చేసుకున్నారు.
ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ ఇనుమెట్ల గ్రామం లోని ప్రజలతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
హెల్మెట్ వాడకం గురించి,గ్రామంలోని పరిస్థితుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని,మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించి, మాదక ద్రవ్యాల వినియోగం వలన జరిగే అనర్థాల గురించి వివరించారు. గ్రామంలో అపరిచిత వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నట్లయితే 112 కు కాల్ చేయాలని తెలిపారు.
రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
అంతేకాకుండా గ్రామంలోని రౌడీషీటర్లు,ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పాత కేసుల నిందితుల తో సమావేశమై పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.
గ్రామంలో అకారణంగా గొడవలు సృష్టిస్తే సహించేది లేదని,గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్న పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని, గొడవలు సృష్టించే వారి మీద జిల్లా అడిషనల్ ఎస్పీ ఆదేశానుసారం చట్ట పరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజుపాలెం మండల్ ఇనుమెట్ల నందు జరిగిన కార్డన్ & సెర్చ్ కార్యక్రమంలో సత్తెనపల్లి రూరల్ CIకిరణ్ . సత్తెనపల్లి టౌన్CI మల్లికార్జునరావు తో పాటు రాజుపాలెం SI మణికృష్ణ అమరావతి SI,పెదకూరపాడు SI మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








