నారద వర్తమాన సమాచారం
యూపీ షార్ప్ షూటర్ నవీన్ కుమార్,ఎన్ కౌంటర్?
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ పోలీసు ఎన్కౌంటర్లో లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన కీలక సభ్యుడు, షార్ప్‌షూటర్ నవీన్‌కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. అతడిపై హత్యలు, దోపిడీ లు సహా 20కి పైగా క్రిమి నల్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్ ప్రాంతంలో యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఎస్టీఎఫ్, దిల్లీ పోలీసులు గురువారం రాత్రి సంయుక్తంగా ఒక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ జరుగుతుండగా లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు నవీన్‌కుమార్ అక్కడికి చేరుకున్నాడు. పోలీసులను గమనించిన వెంటనే వారిపై కాల్పులకు తెగబడ్డాడని, అనంతరం సమీపంలోని అటవీ ప్రాం తంలోకి పారిపోవడానికి విఫలయత్నం చేశాడని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరపగా నవీన్ కుమార్‌కు తీవ్ర గాయాల య్యాయి. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మరణించిన నవీన్ కుమార్‌ను ఘజియాబాద్ జిల్లా పరిధిలోని లోని ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. లారెన్స్ బిష్ణోయ్ ముఠాలో నవీన్ కుమార్ షార్ప్‌షూటర్‌గా చురుగ్గా వ్యవహరిస్తున్నా డని, ముఠాలోని మరో కీలక సభ్యుడు హషీం బాబాతో కలిసి పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
దిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అతడపై హత్య, హత్యా యత్నం, కిడ్నాప్, దోపిడీ వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి సుమారు 20 కేసులు నమోదై ఉన్నా యని అధికారులు పేర్కొ న్నారు. లారెన్స్ బిష్ణోయ్ ముఠా గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా పలు నేర కార్యకలాపాలతో వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఈ ముఠా నుంచి అనేకసార్లు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా, సల్మాన్ స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని కూడా ఈ ముఠా సభ్యులే దారుణంగా హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉన్నప్పటికీ, అక్కడి నుంచే సెల్ఫోన్ల ద్వారా తన అనుచరులతో నిరంతరం టచ్‌లో ఉంటూ నేరాలకు, హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలు తరచూ వినిపి స్తున్నాయి.ఇప్పుడు నవీన్‌కుమార్ ఎన్కౌంటర్ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.