నారద వర్తమాన సమాచారం
సి ఎమ్ ఆర్ ధాన్యం బకాయిల వ్యవహారంలో డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో చుక్కెదురు….!
తెలంగాణలో సి ఎమ్ ఆర్ ధాన్యం బకాయిల వ్యవహారంలో డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.తమపై నమోదైన 540 ఎఫ్ ఐ ఆర్ లను రద్దు చేయాలంటూ మిల్లర్లు దాఖలు చేసిన పిటిషన్లను గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొందరు మిల్లర్లు, ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, తాజాగా వాటిని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించి, ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన సి ఎమ్ ఆర్ బియ్యాన్ని సరఫరా చేయని మిల్లర్లపై 2024 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 540 ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా, లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దుర్వినియోగమైనట్లు పౌరసరఫరాల శాఖ ఆరోపించింది.
బకాయిపడిన మిల్లర్లు తక్షణమే సీఎంఆర్ బియ్యం అందించాలని, లేదంటే బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రభుత్వ ధాన్యం అక్రమ మళ్లింపుపై జీరో టాలరెన్స్ విధానం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








