ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి…జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్
నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక,ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 63 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
అచ్చంపేట మండలం అంబడిపూడి గ్రామస్తుడు అయిన పారుపల్లి నరసింహ రావు అను అతను అదే గ్రామానికి చెందినటువంటి చదలవాడ హరికృష్ణ మరియు చదలవాడ రమణ ఇద్దరు అన్నదమ్ములకు పొలం చేసుకొనుట కొరకు కౌలుకు ఇప్పించినట్లు, మరియు 7,24,000/-
రూపాయలు ఇప్పించినట్లు, పైన తెలిపిన డబ్బులకు గాను 4,80,000/- లు చెల్లించి ఇంకా2,44,000/- లు ఇవ్వకుండా ఉన్నట్లు,ఇవ్వవలసిన డబ్బులు అడిగితే మేము ఇవ్వము నీకు చేతనైంది చేసుకో అంటూ బూతులు తిడుతున్నట్లు మరియు కాళ్లు విరగగొడతామని బెదిరిస్తున్నందుకు గాను వారిపై కఠిన చర్యలు తీసుకున వలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాది అర్జీ ఇవ్వడం జరిగింది.
చిలకలూరిపేట లంబాడి కాలనీ వద్ద నివాసం ఉంటున్న అనుమర్లపూడి అరుణా దేవి కి ఒక ఆడ, ఒక మగ సంతానం. ఫిర్యాదు భర్త అయిన నరసింహ రావు 2021 వ సంవత్సరం లో కరోనా వల్ల చనిపోయినట్లు, ఫిర్యాదు కూతురు అయిన వైష్ణవి ఆమె స్వశక్తి తో బతుకుతున్నట్లు, ఫిర్యాదు కుమారుడు అయిన నాగ సాయి హేమంత కుమార్ గుప్తా కు అతని స్నేహితులు కొంతమంది యాప్ లోన్ తీయించి భయభ్రాంతులకు గురిచేసి ఊరు వదిలి పెట్టి పోయే విధంగా భయపెట్టినట్లు, ఆ సమయంలో అప్పటి SI పిలిపించి ధైర్యంతో ఉండు, నువ్వు యాప్ల ద్వారా డబ్బులు తీసుకుని తినలేదు కదా. వాళ్లు వస్తే నా దగ్గరకు తీసుకురావాలని మంచి మాటలతో ధైర్యం చెప్పి ఇంట్లో ఉండమని పంపించినట్లు, సదరు ఆ విషయం జరిగిన కొన్ని రోజులపాటు ధైర్యంగా ఫిర్యాదుతో పాటే ఉండి తదుపరి ఫిర్యాదుకు కూడా చెప్పకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని చిలకలూరిపేట నుండి వెళ్లిపోయినట్లు, కావున ఫిర్యాదు ఆచూకీ తెలియకుండా ఆందోళనతో భయపడుతూ న్యాయం కొరకు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
పాలపర్తి రామారావు గుంటూరు నందు నివాసం ఉంటున్నట్లు, ది.27.03.2024 వ తేదీన వినుకొండ మండలం నాగులవరం గ్రామానికి చెందినటువంటి
దేవరకొండ చిన వెంకటేశ్వర్లు అతని భార్య అయిన నాగేంద్ర తో కలిసి ఫిర్యాదు ఇంటికి వచ్చి మూడు లక్షల రూపాయలు అడిగి తీసుకున్నట్లు, డబ్బులు అప్పుగా తీసుకున్నందుకు గాను వరి కోత మిషన్ కాగితాలు ఇచ్చినట్లు, మధ్య మధ్యలో డబ్బులు అడగగా మిషన్ అమ్మ డబ్బులు ఇస్తాను అని కొద్దిరోజులు, మూడు ఎకరాల పొలం ఉన్నది అది అమ్మి డబ్బులు ఇస్తానని నమ్మ పలికినట్లు, తరువాత కొన్ని రోజులకు వరి కోత మిషన్ అమ్మిన విషయం తెలిసి నాగులారం గ్రామానికి వెళ్లి డబ్బులు అడుగగా చిన్న వెంకటేశ్వర్లు అతని భార్య నాగేంద్రము అతని మేనల్లుడు కలసి తిడుతూ, కొట్టినందుకు గాను
తగిన న్యాయం కొరకు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
సాతులూరు గ్రామం నాదెండ్ల మండలం నకు చెందిన షేక్ నాగూర్ బి భర్త ప్రేమ్ కుమార్ తో సుమారు ఏడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు, వారి వివాహం అనంతరం ఒక ఆడ సంతానం కలిగినట్లు,
అనంతరం ఫిర్యాదు భర్త నిత్యం మద్యం సేవించి చీటికి మాటికి కొడుతూ, అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నట్లు, నరసరావుపేట కమ్మంపాలెం గ్రామానికి చెందిన వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఈ రోజు ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
వినుకొండ కు చెందిన ఈపెనగండ్ల వీరాంజనేయులు ఇంటర్ పూర్తి చేసి హెచ్.పీ గ్యాస్ కార్యాలయము నందు గుమస్తాగా పని చేస్తున్నట్లు, ది.10.09. 2024 న తన మొబైల్ కు టెలిగ్రామ్ అప్ నందు మెసేజ్ రాగా సదరు మెసేజ్ ని గమనించి వారికి మెసేజ్ చేయగా వారు మార్కెటింగ్ చేస్తే డబ్బులు ఇస్తాము అని, మార్కెటింగ్ చేసి స్క్రీన్ షాట్ లు పెట్టమని డబ్బులు ఇస్తామని తెలిపినట్లు, మధ్య మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెంటనే డబ్బులు అధిక మొత్తంలో తిరిగి ఇస్తామని తెలుపగా వారి మాటలు నమ్మి సదరు మార్కెటింగ్ మెసేజ్ లు వారికి షేర్ చేసినట్లు, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయనే ఆశతో మొత్తంగా 71,700/- లు పంపినట్లు, తరువాత వారి వద్ద నుండి ఎటువంటి స్పందన రాకపోయేటప్పటికి ది.08.11.2024వ తేదీన సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేసి డబ్బులు హోల్డ్ చేయించినట్లు, కావున మోసపూరితంగా నమ్మకంగా ప్రలోభ పెట్టీ ఫిర్యాదు వద్ద నుండి డబ్బులను కాజేసిన వారిని చట్టరీత్యా తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహయ సహకారాలు అందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.