నారద వర్తమాన సమాచారం
సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి భేటీ.. చర్చించిన అంశాలు ఇవే!
సీఎం చంద్రబాబుతో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాజధాని అమరావతిలో భేటీ అయ్యారు. అయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ని సీఎం చంద్రబాబు భోజనానికి ఆహ్వానించారు. దీంతో వారు లంచ్ మీటింగ్‌లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వీరు కీలకంగా చర్చించారు.
హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై చర్చించారు.
టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విన్నవించారు.
పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు.
బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు వివరించారు.
పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్టసవరణ చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కోరారు.
ఆయిల్ పామ్ దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించడంపై పునరాలోచన చేయాలని.. దీనివల్ల రైతు నష్టపోతాడని పీయూష్ గోయల్‌ను చంద్రబాబు కోరారు.
ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో ఆ దేశంతో చర్చలు జరపాలని సీఎం చంద్రబాబు సూచించారు.
సీఫుడ్‌పై అమెరికా విధించిన 27 శాతం సుంకాలు ఏపీలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావితం చూపుతోందని ఆయనకు సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారు.
మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ని సీఎం చంద్రబాబు కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.