నారద వర్తమాన సమాచారం
రాష్ట్ర సచివాలయం నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు
ఈ నెల 21న జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్లో 10 వేల మందితో జిల్లా స్థాయి కార్యక్రమం..
అమరావతి ధ్యాన బుద్ధుడి విగ్రహం వద్ద మరో 10,000 మంది
జిల్లాలోని 5000 వేదికల వద్ద సామూహిక యోగా కార్యక్రమం
-యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లాలో 9.81 లక్షల మంది నమోదు.
-జిల్లా వ్యాప్తంగా గ్రామ/వార్డు సచివాలయ పరిధిలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాలి.. - జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు
ఈ నెల 21న జిల్లా అంతటా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు.
గురువారం మధ్యాహ్నం యోగాంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నద్ధత, జిల్లాలో ఏర్పాట్లు, యోగా ట్రైనర్స్ కు, యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల పంపిణీ, ఫేజ్-3 యోగా శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా గౌరవ దేశ ప్రధాని పాల్గొంటున్నారన్నారు.
జిల్లాలో ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే జిల్లాస్థాయి కార్యక్రమం 10 వేల మందితో
కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్ లో, మరో 10,000 మందితో అమరావతి ధ్యాన బుద్ధ విగ్రహం వద్ద నిర్వహించడం జరుగుతుందని అందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా 21న జిల్లా అంతటా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అధికారులు ప్రత్యేక కృషి చేయాలని ఆయన తెలిపారు. జిల్లావ్యాపంగా వార్డు/ గ్రామ సచివాలయాలు పరిధిలో గుర్తించిన వేదికలలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు, సాధారణ ప్రజలను భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఇంతవరకు యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి సుమారు 9.81లక్షల మంది పేర్లను నమోదు చేసుకున్నారన్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ట్రైనర్లుకు, పాల్గొన్నావారికి సర్టిఫికెట్ అఫ్ ఎక్సలెన్స్, పార్టిసిపేట్ సర్టిఫికెట్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమాలకు సంబంధించి మిగిలిన చివరి రెండు రోజులు సంబంధిత అధికారులు అందరు అప్రమత్తమత్తతో వ్యవహారించి విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.