యోగాంధ్రకు సర్వం సిద్ధం!
రేపు విశాఖకు రానున్న ప్రధాని నరేంద్ర మోడీ!
విశాఖ
ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహి స్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం సిద్ధమైంది. ఈ నెల 21న ఉదయం 6.30 నుంచి 7.50 గంటల వరకూ నిర్వహించనున్న యోగా ప్రదర్శనలో దాదాపు 5లక్షల మంది పాల్గొంటారని అధికార యంత్రాంగం ప్రకటించింది.
ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ 30.16 కిలోమీటర్ల పొడవునా 3.6 లక్షల మందికి ఏర్పాట్లు చేసింది. ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో సుమారు వెయ్యి మంది చొప్పున పట్టేలా ఈ మార్గాన్ని 326 భాగాలుగా విభజించింది. అలాగే యోగాసనాలు వేసేవారి కోసం పచ్చటి కార్పెట్లు పరిచారు. బీచ్‌రోడ్డుకు అనుసంధానంగా ఉన్న రహదారులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, నగరంలోని విద్యా సంస్థలు, మైదానాల్లో మరో లక్షన్నర మందికిపైగా యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
విశాఖ నగరంతోపాటు అనకాపల్లి, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి తరలివచ్చే వారికోసం బస్సులు సిద్ధం చేస్తున్నారు. ఏ జిల్లాకు చెందినవారు ఏ కంపార్టు మెంట్లకు రావాలో ఇప్పటికే ఆయా జిల్లాల యంత్రాం గాలకు సమాచారం అందించారు. ప్రతి కంపార్టు మెంట్‌కు అధికారులను, వలంటీర్లను నియమిం చారు.
యోగా వేడుకలో పాల్గొనేం దుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రానికి విశాఖకు రానున్నారు. ప్రధాని, గవర్నర్, సీఎం, ఇతర ప్రముఖుల కోసం ఆర్కే బీచ్‌రోడ్డులోని కాళీమాత ఆలయం సమీపాన ప్రధాన వేదిక ఏర్పాటుచేశారు. ప్రధాన వేదిక వద్ద నుంచి పార్క్ హోటల్ వరకూ 18వేల మంది కార్యక్రమం లో పాల్గొంటారు.
వేదిక ముందు భాగంలో నేవీ అధికారులు, ఉద్యోగులకు అవకాశం కల్పిస్తారు. ఆర్కే బీచ్‌రోడ్డు లో ప్రధాన వేదికకు ప్రత్యామ్నాయంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 15వేల మంది పాల్గొనేందుకు షెడ్లు వేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.