నారద వర్తమాన సమాచారం
పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం..
అర్జీల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తే ధ్యేయం.
పిజిఆర్ఎస్ లో 180 అర్జీల రాక..
జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)వేదికలో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం స్ధానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) ద్వారా జిల్లా నలుమూలలు నుండి వచ్చిన అర్జీదారులు నుండి అర్జీలను జాయింట్ కలెక్టర్ సూరజ్ స్వీకరించారు.జాయింట్ కలెక్టర్ సూరజ్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి అర్జీలను స్వీకరించారు. సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ లో 180 అర్జీలు అందాయని తెలిపారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సూరజ్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటిజాప్యానికి తావులేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీదారుని సంతృప్తే ధ్యేయంగా అర్జీల పరిష్కారతీరు వుండాలని స్పష్టం చేశారు. అర్జీలు రీ-ఓపెన్ కాకుండా పరిష్కార చర్యలు ఉండాలన్నారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పూర్తిస్ధాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబందిత శాఖకు పరిష్కారం కోసం పంపాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.