నారద వర్తమాన సమాచారం
పిన్నెల్లి గ్రామం లో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ మరియు సాగు పై అవగాహన సదస్సు :
మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ మరియు అవగాహన సదస్సును ఉద్యాన శాఖ, పల్నాడు జిల్లా మరియు వ్యాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి సహకారంతో ఈ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ మన జిల్లాలో మొదటి విడతలో ఆయిల్ ఫామ్ సాగుకు 8 మండలాలు రాష్ట్ర ప్రభుత్వము ఎంపిక చేసి ఉన్నారు. 8 మండలాల్లో మన గురజాల నియోజకవర్గానికి సంబంధించి రెండు మండలాలు అనగా పిడుగురాళ్ల మరియు మాచవరం ఎంపిక చేయటం ఎంతో సంతోషకరముగా ఉందన్నారు. అలాగే ఆయిల్ ఆయిల్ ఫామ్ అంటే నూనె పంట,మార్కెట్లో ఎప్పుడు డిమాండ్ ఉన్న పంట, ప్రతి సంవత్సరము ఒక లక్ష కోట్లు ఖర్చుపెట్టి విదేశాల నుండి 150 లక్షల టన్నుల వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నారు. అలాగే ఆయిల్ పామ్ మొక్కలు నాటిన నాలుగు సంవత్సరాల నుండి కాపు మొదలయ్యి 30 సంవత్సరాల వరకు నిరంతర దిగుబడితో, నిరంతర ఆదాయం వస్తుందన్నారు. దీనిలో తెగుళ్లు, చీడపీడలు ఇతర పంటలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందన్నారు. ఆయిల్ పామ్ ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా తట్టుకుంటుందన్నారు. అలాగే కోతులు, అడవి పందుల బెడద ఉండదన్నారు. ఆయిల్ పామ్ కొనుగోలులో దళారుల వ్యవస్థ ఉండదు నేరుగా రైతుల నుండి కంపెనీ వారు రైతులు పండించిన ఆయిల్ ఫామ్ గెలలు కొనుగోలు చేస్తుందన్నారు. ఇతర పంటలతో పోలిస్తే ఖర్చు ఫోను ఎకరాకు నికరంగా ఒక లక్ష రూపాయల పైన ఆదాయం మిగులుతుందన్నారు. అలాగే జిల్లా ఉద్యాన అధికారి ఐ. వెంకటరావు గారు మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఆయిల్ పామ్ సాగు చేసుకోవడానికి గుర్తించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో మెగా ప్లాంటేషన్ డ్రైవ్ లో భాగంగా 20 ఎకరాల్లో ఈరోజు ప్లాంటేషన్ చేయడం జరిగిందన్నారు. అలాగే ఆయిల్ పామ్ సాగు మరియు రాయితీ గురించి వివరించడం జరిగింది. ఆయిల్ పామ్ మొక్కల ఖరీదు పై 100% రాయితీతో ఒక హెక్టార్ కి 150 మొక్కల చొప్పున విదేశీ మొక్కలకు 193 రూపాయలు, దేశీ మొక్కలకైతే 133 రూపాయిలు చొప్పున 29 వేల రూపాయలు రాయితీ ఇవ్వబడుతుందన్నారు. సాగు ప్రోత్సాహంలో భాగంగా హెక్టారుకు 50% రాయితీపై నాలుగు సంవత్సరాలు గాను 21000 మించకుండా రాయితీ ఇవ్వబడుతుందన్నారు. అలాగే అంతర పంట సాగుకై నాలుగు సంవత్సరాల గాను 21000 రాయితీ ఇవ్వబడును. బిందు సేద్యం ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ నియమ నిబంధనల ప్రకారంగా ఆయిల్ పామ్ సాగు చేసుకున్న రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు చేయ దలుచుకున్న రైతులు కచ్చితంగా నీటి వసతి ఉండి బోర్వెల్ సదుపాయం ఉండి ఎండాకాలంలో కూడా నీళ్లు ఉండేటట్లయితే రైతు సాగు చేసుకోవాల్సిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో భాగంగా డాట్ సెంటర్ శాస్త్రవేత్త నగేష్ మాట్లాడుతూ మిరపలో చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యలు మరియు వేయవలసిన ఎరువుల మోతాదును రైతులకు వివరించడం జరిగింది. వ్యాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఎం. రామ్మోహన్ రావు మాట్లాడుతూ మాచవరం మండలంలో దాదాపుగా 212 ఎకరాల్లో రైతుల్ని ఆయిల్ ఫామ్ సాగుకు గుర్తించడం జరిగిందన్నారు. అదేవిధంగా కంపెనీ ద్వారా ఆయిల్ పామ్ గెల్లలు కొనుగులు కేంద్రాలు ను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తామని చెప్పారు . ఆయిల్ పామ్ పంట యొక్క మెలుకువలు మరియు యాజమాన్య పద్ధతులు గురించి వివరించారు.2024-25 సంవత్సరానికి గాను 925 ఎకరాలు సాగులో ఉందన్నారు, అలాగే 2025-26 సంవత్సరానికి గాను 1450 ఎకరానికి గాను గుర్తచడం జరిగిందన్నారు, అందులో భాగంగా 250 ఎకరాలు ఈరోజు మొక్కలు నాటడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో అధికారూలైన ఐ. వెంకటరావు , జిల్లా ఉధ్యాన అధికారి, పల్నాడు,P. రామకృష్ణ , సీఈఓ, వేల్యూ ఆయిల్ కంపెనీ, వైస్ ప్రెసిడెంట్ M. రామ్మోహన్ రావు M. నగేష్ , దాట్ సైంటిస్ట్స్, బంగారం. శ్రీకృష్ణ దేవరాయలు గారు, ADA, అగ్రికల్చర్, N. నాగమల్లేశ్వర్ , MRO, ఎంపీడీఓ D. విష్ణు చిరంజీవి ఉద్యాన శాఖ అధికారి, గురజాల Y. మోహన్ , ఉద్యాన శాఖ అధికారి, పిడుగురాళ్ల M. అంజలి బాయ్ AO, రామమ్మా MIE బధ్రు నాయక్ , ఏరియా మేనేజర్, M. నవీన్ పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలైన CH. జానీ భాష, SK.G.దస్తగిరి, Y.రామి రెడ్డి, CH. సుభాని, T. అమర్నాథ్, P. ఖాదర్ వలి
నీటి సంఘాల అద్యక్షులు :
Ch. గౌస్
P. పకీరా
P. పూర్ణయ్య
Ch. మాభూసుభాని. అంకిరెడ్డి
B. వెంకయ్య
మాచవరం తేదేపా అధికార ప్రతినిధి -P. శేఖర్ మరియు గ్రామ నాయకులు మరియు మండలం లోని వివిధ గ్రామాల రైతులు 400 మంది దాకా పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.