Monday, August 4, 2025

జాతీయ రహదారి 167 A విస్తరణతో నియోజకవర్గ ప్రగతి పుంజుకుంటుంది : ప్రత్తిపాటి

నారద వర్తమాన సమాచారం

జాతీయ రహదారి 167 A విస్తరణతో నియోజకవర్గ ప్రగతి పుంజుకుంటుంది : ప్రత్తిపాటి

  • ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి గడ్కరీ సమక్షంలో రూ.5వేలకోట్లతో చేపట్టిన పలు జాతీయ రహదారుల ప్రారంభోత్సవం, శంఖుస్థాపన కార్యక్రమం
  • కేంద్రప్రభుత్వ సహకారంతో కూటమిప్రభుత్వం నిర్మించనున్న పలు జాతీయ రహదారుల ప్రత్యేక సమీక్ష సమావేశంలో కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎంపీలతో కలిసి వేదిక పంచుకున్న ప్రత్తిపాటి
  • చిలకలూరిపేట – నకరికల్లు జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రారంభంపై నియోజకవర్గ ప్రజల తరుపున సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ప్రత్తిపాటి.

కేంద్రప్రభుత్వం జాతీయ రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం నిజంగా రాష్ట్ర ప్రగతికి ఎంతో కీలకమవుతుందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి చెప్పారు. శనివారం సాయంత్రం మంగళగిరిలోని సీ.కే కన్వెన్షన్ లో జరిగిన జాతీయ రహదారుల ప్రత్యేక సమీక్ష సమావేశంలో ప్రత్తిపాటి పాల్గొన్నారు. రాష్ట్రంలోని 29 జాతీయ రహదారుల నిర్మాణ.. విస్తరణపనుల్ని కేంద్రమంత్రి గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రారంభించడంపై ప్రత్తిపాటి సంతోషం వ్యక్తంచేశారు. జాతీయ రహదారి 167 (A) చిలకలూరిపేట నుంచి నకరికల్లు వరకు ఉన్న రోడ్డు నాలుగువరసల విస్తరణ పనులకు గడ్కరీ, చంద్రబాబు వేదికపై నుంచే వర్చువల్ విధానంలో శంఖుస్థాపన చేశారని ప్రత్తిపాటి చెప్పారు. మొత్తం 38 కిలోమీటర్లు విస్తరించనున్న రహదారి పనులకు రూ.787కోట్లు ఖర్చుచేయనున్నట్టు ప్రత్తిపాటి తెలిపారు. ఈ రహధారి విస్తరణ పనులు పూర్తయితే, నియోజకవర్గ ప్రగతి పుంజుకుంటుందని ప్రత్తిపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి నిజాంపట్నం పో ర్టుకు రాకపోకలు పెరుగుతాయని, తద్వారా పర్యాటకాభివృద్ధికి కూడా అవకాశాలు మెరుగుపడతాయని ప్రత్తిపాటి తెలిపారు.

అన్నదాతా సుఖీభవ నిధుల విడుదలపై ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశాను

రైతుల సమస్యలు గుర్తించి, వారికష్టాన్ని తన కష్టంగా భావించే నాయకుడు చంద్రబాబు ఒక్కరేనని, ఆయన నేడు విడుదలచేసిన అన్నదాతాసుఖీభవ సాయంపై ముఖ్యమంత్రికి నియోజకవర్గ రైతాంగం తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసినట్టు ప్రత్తిపాటి చెప్పారు. వేదికపైన ముఖ్యమంత్రితో కరచాలనం చేసినప్రత్తిపాటి.. నిధుల విడుదలపై రైతాంగం అభిప్రాయాలను తెలియచేశారు. హెచ్ డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు సకాలంలో ప్రారంభించడం ద్వారా నియోజకవర్గంలోని వేలమంది రైతులకు ఎంతో మేలు కలిగిందని ప్రత్తిపాటి …. ముఖ్యమంత్రికి తెలియచేశారు. రైతులకు మన ప్రభుత్వంలో ఏ కష్టం రాకూడదని, అందుకోసం ఏం చేయడానికైనా మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని ప్రత్తిపాటి తెలిపారు.

కార్యక్రమంలో కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎంపీ పురంధేశ్వరి, మంత్రులు సత్యప్రసాద్, జనార్థన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక అధికారులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version