నారద వర్తమాన సమాచారం
బోర్డర్‌లో హై టెన్షన్.. పాక్-భారత్ మధ్య మళ్లీ కాల్పులు.!!_
భారత్-పాక్ బోర్డర్‌లో హై టెన్షన్ నెలకొంది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది.
దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల పాటు కాల్పులు జరిపిందని తెలుస్తోంది. దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం కూడా ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ఎలాంటి కాల్పులు జరగడం లేదు. అయితే ఉగ్రవాదులు మళ్లీ ఎంటర్ కావడానికి ప్రయత్నించే అవకాశం ఉందని సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో ఎల్ఓసి వెంబడి హై అలర్ట్ ప్రకటించారు.








