Friday, May 15, 2026
spot_img

బ్యాంకుల భద్రత రక్షణ అంశాలపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్

నారద వర్తమాన సమాచారం

బ్యాంకుల భద్రత రక్షణ అంశాలపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి. శ్రీనివాసరావు ఐపిఎస్  ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు. జిల్లాలోని బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం,నేరాలను అరికట్టడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ స్థానిక బ్యాంక్ మేనేజర్లు, సెక్యూరిటీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…

ఈ కార్యక్రమం నందు ఎస్పీ  ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల వినియోగం, సెక్యూరిటీ గార్డ్స్ పనితీరు,అలారం సిస్టమ్స్ డబల్ లాక్ విధానం వంటి సాంకేతిక భద్రత చర్యలు,అత్యవసర పరిస్థితులలో తీసుకోవలసిన చర్యలపై, వివరంగా చర్చించి పలు సూచనలు అందించారు.

బ్యాంకు ప్రాంగణంలో రాత్రి పూట లైటింగ్ సౌకర్యం, సెక్యూరిటీ గార్డుల పహారా విధులు, నగదు రవాణా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని, ప్రజల భద్రత కోసం బ్యాంకు-పోలీసుల మధ్య సమన్వయం నిరంతరం కొనసాగాలని ఎస్పీ పేర్కొన్నారు.

జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించడం జరిగింది.

ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్ కాల్స్, కృత్రిమ వెబ్‌సైట్ల ద్వారా జరుగుతున్న మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యవసరమని చెప్పారు.

బ్యాంకు ఖాతాదారుల డేటా భద్రత, OTP/పాస్‌వర్డ్ రహస్యత, అనుమానాస్పద లావాదేవీలను వెంటనే గుర్తించి పోలీసులకు సమాచారం అందించడం పై చర్చించారు.

సైబర్ నేరాలకు సంబంధించి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 1930 గురించి, సోషల్ మీడియా అవగాహన ప్రచారాలపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు.

సమావేశంలో బ్యాంకు ప్రతినిధులు తమ సమస్యలు, భద్రతా అవసరాలను వివరించగా, పోలీసు అధికారులు చట్టపరంగా వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అడ్మిన్ ఎస్పీ J.V.సంతోష్

యూనియన్ బ్యాంక్ LDM K.రాంప్రసాద్ వివిధ బ్యాంక్ ల మేనేజర్లు,
సెక్యూరిటీ అధికారులు మరియు SB – 2 సీఐ P. శరత్ బాబు , జిల్లా సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version