నారద వర్తమాన సమాచారం
అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి. శ్రీనివాసరావు ఐపీఎస్ అధ్యక్షతన ఘనంగా అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహణ.
పల్నాడు జిల్లా, నరసరావుపేటలోని A1 కన్వెన్షన్ హాల్‌లో ఈ రోజు (19.07.2025) నిర్వహించిన ఈ సమావేశంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు 13వ ADJ కోర్టు న్యాయమూర్తి N. సత్యశ్రీ జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ డా. రవి, ఉమ్మడి గుంటూరు జిల్లా ఫోరెన్సిక్ శాస్త్రవేత్త రవికుమార్ పిపీలు, ఏపీపీలు, రెవెన్యూ, ఎక్సైజ్, ఫైర్, ఇతర శాఖల అధికారులు, పోలీస్ అధికారులూ పాల్గొన్నారు.
సమావేశ ముఖ్యాంశాలు
ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ
గత ఆరు నెలల నేర గణాంకాలపై సమగ్ర సమీక్ష, కేసుల దర్యాప్తు పురోగతి, ప్రజల ఫిర్యాదుల పరిష్కార అంశాలపై చర్చ.
న్యాయ, ఫోరెన్సిక్, పోలీస్ మరియు ఇతర శాఖల సమిష్టి కృషి ప్రాధాన్యత.
సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు వేగవంతం చేసి ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలన్న ఆదేశం.
ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న సూచన.
పోలీస్ బీట్ వ్యవస్థను బలోపేతం చేయడం, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ముమ్మరం చేయడం.
నేర ప్రభావిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచన.
మత్తుపదార్థాలపై నిరంతర స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించడం.
శక్తి టీంల ద్వారా మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి.
ఆధునిక పద్ధతుల ద్వారా సమర్థవంతమైన దర్యాప్తు, సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు.
పల్లెనిద్ర, అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ కావడం.
మైనర్ల వాహన నడుపుదలపై ప్రత్యేక డ్రైవ్, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్.
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు మాట్లాడుతూ
బాలికలు, మహిళలు, వృద్ధులపై దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆదేశం.
సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించి నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచన.
పోక్సో కేసులపై స్కూళ్లు, కళాశాలలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న సూచన.
డ్రగ్స్, గంజా వంటి మత్తుపదార్థాలపై యువతలో జాగ్రత్త కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
మైనర్లు వాహనాలు నడపడం, ఓవర్‌లోడింగ్ వంటి అంశాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
PDS రైస్, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రెవెన్యూ–పోలీస్ సంయుక్త చర్యలపై చర్చ.
13వ ADJ న్యాయమూర్తి N. సత్యశ్రీ సూచనలు
వేగవంతమైన దర్యాప్తు, సమయానికి న్యాయపరమైన ఆధారాలు సమర్పించడం.
సాక్షుల హాజరును నిర్ధారించే చర్యలు, వారిని రక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ.
నేర గణాంకాల అప్డేట్, అధిక నేరాలున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా.
కేసుల పరిష్కార రేటు మెరుగుపరచాలని, సరైన సాక్ష్యాధారాలతో న్యాయ విచారణ విజయవంతం చేయాలని సూచించారు.
ఉత్తమ సేవలకు పురస్కారాలు :–
గత ఆరు నెలల కాలంలో కేసుల దర్యాప్తు, సమాచార వ్యవస్థ బలోపేతం, అవగాహన కార్యక్రమాలు, బందోబస్తు విధుల నిర్వహణలో ఉత్తమంగా సేవలందించిన పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి కలెక్టర్ చేతుల మీదుగా మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేయడం జరిగింది.
ఈ సమావేశం ద్వారా జిల్లాలో నేరాల నివారణ, ప్రజల భద్రత, న్యాయ పరిరక్షణకు సంబంధించి సమగ్ర వ్యూహాన్ని రూపొందించడమే కాకుండా, విభిన్న శాఖల మధ్య సమన్వయం బలోపేతం చేయడంలో ఇది ఒక మైలురాయిగా నిలిచింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.