నారద వర్తమాన సమాచారం
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153 జయంతి వేడుకలను నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153 వ జయంతి వేడుకలను పోలీసు ప్రధాన కార్యాలయం నందు ఘనంగా నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు ఐపీఎస్
ఈరోజు ది. 23.08.2025 తేదీన జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధులు,ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది.
స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన తెగువ, ధైర్యం నిరుపమానం. సైమన్ గో బ్యాక్ అంటూ బ్రిటీష్ వారి తుపాకీ గుండ్లకు ఎదురు నిలిచి ఆంధ్రకేసరి గా (ఆంధ్ర సింహం) పేరు
పొందారన్నారు.
1921 అక్టోబర్ 29 న స్వరాజ్య అనే దిన పత్రికను ప్రారంభించి కొద్ది కాలంలోనే తెలుగు, తమిళ భాషలలో మంచి ఆదరణ పొందేలా కృషి చేసారు.
రాష్ట్ర అభివృద్ధికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విశేష కృషి చేశారన్నారు.
ప్రకాశం పంతులు నిరుపేద కుటుంబం నుండి వచ్చి ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా,తన ధైర్యం, పట్టుదల ద్వారా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు.
వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) JV సంతోష్ , ఏ.ఆర్ అదనపు ఎస్పి V.సత్తి రాజు , ఏఆర్
డిఎస్పి మహాత్మా గాంధీ రెడ్డి,SB – 1 సిఐ B. సురేష్ బాబు , వెల్ఫేర్ ఆర్ఐ L. గోపీనాథ్ ,MT ఆర్ ఐ S.కృష్ణ ,అడ్మిన్ RI M.రాజా ,ఇతర పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.