నారద వర్తమాన సమాచారం
ఎల్.హెచ్.ఎం.ఎస్.(LHMS) సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
– పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు, ఐ.పి.ఎస్.,
పల్నాడు ప్రజల ఆస్తులకు రక్షణ కవచంలా ఎల్.హెచ్.ఎం.ఎస్. మొబైల్ యాప్
పంచాయితీ, మున్సిపల్ ప్రాంతాల్లో ప్రజలకు ఉచితంగా ఎల్.హెచ్.ఎం.ఎస్. మొబైల్ యాప్ సేవలు అందుబాటులో ఉంటాయన్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు, ఐపిఎస్
వేసవి సెలవుల్లో ఎల్.హెచ్.ఎం.ఎస్. యాప్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు ప్రజలను కోరిన జిల్లా ఎస్పీ
జిల్లాలోని పోలీసు స్టేషన్ ల పరిధిలోని పంచాయితీ, మున్సిపల్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వేరే ఊర్లకు వెళ్ళే సమయాల్లో తమ ఇండ్లలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఎల్.హెచ్.ఎం.ఎస్. (లాక్డ్ హౌస్
మానిటరింగ్ సిస్టం) సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు కోరారు.
దొంగతనాల నియంత్రణకు రాష్ట్ర పోలీసుశాఖ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం (LHMS)ను
ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. ఈ విధానం పట్ల ప్రజలకు అవగాహన లేకపోవడం వలన ఇల్లు విడిచిపెట్టి బయట ప్రాంతాలకు వెళ్ళే సమయాల్లోనే ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి అని తెలిపారు.
ఈ (LHMS) ఎల్.హెచ్.ఎం.ఎస్. మొబైల్ యాప్ వినియోగం వలన ప్రజల ఆస్తుల రక్షణకు కవచంలా పని చేస్తుందన్నారు.
పోలీసు స్టేషను పరిధిలోని ప్రజలు
ఎవరైనా తాము ఇల్లు విడిచి తమ స్వంత అవసరాలు లేదా పనులు లేదా ఉద్యోగరీత్యా లేదా పండగలకు లేదా ఏదైన ఇతర కారణాల వలన బయట ప్రాంతాలకు వెళ్తున్నట్లుగా సంబంధిత పోలీసు స్టేషనుకు ముందస్తు సమాచారాన్ని అందించినట్లయితే పోలీసులు
ఎల్.హెచ్.ఎం.ఎస్. సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తారన్నారు.
LHMS వినియోగించే విధానం
ఇందుకుగాను వారు తమ స్మార్ట్ ఫోనులో గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎల్.హెచ్.ఎం.ఎస్. యాప్ ను డౌన్లోడ్ చేసుకొని, ఇంటి నుండే తమ పేరు, ఫోను నంబరు,
లొకేషన్ వంటి ఇతర వివరాలను, ఎల్.హెచ్.ఎం.ఎస్.
సేవలను ఎప్పటి నుండి ఎప్పటి వరకు పొందాలి అనుకుంటున్న విషయాలను యాప్ లో నమోదు చేసి రిక్వెస్ట్ పంపాలన్నారు.
రిక్వెస్ట్ పంపిన తరువాత వారి మొబైల్ నంబరుకు ఒక రిజిస్ట్రేషను నంబరు వస్తుందని, ఈ నంబరునే యూజర్ ఐడిగా పొందవచ్చునన్నారు.
ఇలా రిక్వెస్ట్ పంపిన తరువాత సంబంధిత పోలీసు స్టేషను నుండి పోలీసులు సదరు ఇంటిని సందర్శించి, సిసి కెమెరా లను ఏర్పాటు చేసి ఇండ్ల పై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తారన్నారు.
నిఘా కొరకు ఏర్పాటు చేసిన సిసి కెమెరాలతో ఈ యాప్ ను అనుసంధానం చేయడం వలన
దొంగతనాలు జరగకుండా నియంత్రించవచ్చునన్నారు.
ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఇంటి పరిసరాలలోకి ప్రవేశించిన
వెంటనే పోలీసు కంట్రోల్ రూం కు సమాచారం చేరవేస్తూ, అలారం మ్రోగుతుందన్నారు.
దీనితో పోలీసులు అప్రమత్తమై,
సంబంధిత పోలీసు స్టేషనుకు సమాచారం అందించి, దొంగతనాలు జరగకుండా సులువుగా నియంత్రించడంతో పాటు, నిందితులను కూడా రెడ్ హ్యాండడ్ గా పట్టుకోవచ్చు అని తెలిపారు.
పల్నాడు జిల్లా లోని పోలీసు స్టేషన్ ల పరిధిలోని పంచాయితీ, మున్సిపల్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎల్.హెచ్.ఎం.ఎస్. సేవలను
సద్వినియోగం చేసుకోవచ్చునన్నారు.
పల్నాడు జిల్లాలో నివసించే ప్రజలు ఎప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా
ఎల్.హెచ్.ఎం.ఎన్. సౌకర్యాన్ని ఉచితంగా వినియోగించుకోవాలని, దొంగతనాల నియంత్రణలో పోలీసులకు
సహకరించాలని ప్రజలను జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.