నారద వర్తమాన సమాచారం
విశ్వకర్మ కళా రత్న జాతీయ పురస్కారం ఎంపికైన తంగెళ్లపల్లి అరవింద మహర్షి
శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధునిక ధార్మిక కళాపరిషత్ జాతీయ సాహితీ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ మరియు తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 17 సెప్టెంబర్ 2025 విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని గుర్తించి ప్రతి సంవత్సరం విశ్వకర్మ జాతీయ పురస్కారాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఈ సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కు చెందిన బ్రహ్మశ్రీ తంగెళ్లపల్లి అరవింద మహర్షి కి విశ్వకర్మ కళా రత్న జాతీయ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగినదని
కార్యనిర్వహణ కమిటీ
గౌరవ అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి
చైర్మన్ బ్రహ్మశ్రీ పోలోజు రాజ్ కుమార్ చార్యులు ఒక ప్రకటనలో తెలియజేశారు
ఈ పురస్కారాన్ని తెలంగాణ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో తేదీ14 సెప్టెంబర్ 2025 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు వేదిక శ్రీరాజ్యలక్ష్మి కన్వెన్షన్ హాల్ లో
ముఖ్య అతిథుల చేతుల మీదుగా పురస్కారాన్ని ప్రధానం చేయనున్నట్లు
చైర్మన్ పోలోజు రాజ్ కుమార్ చార్యులు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








