నారద వర్తమాన సమాచారం
అమూల్యమైన సేవలకు ఆపన్నహస్తం
అనారోగ్యంతో మరణించిన హోంగార్డు కుటుంబానికి అండగా నిలిచిన హోంగార్డులను అభినందించిన పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కంచి.శ్రీనివాస రావు ఐపిఎస్ గారు,.
తోటి సహోద్యోగుల కుటుంబాలకు సహాయం చేయడానికి మరణించిన హోంగార్డు కి ఒక్కరోజు వేతనం అందించిన పల్నాడు జిల్లా హోంగార్డులు. అభినందించిన ఎస్పీ కంచి.శ్రీనివాస రావు ఐపిఎస్
వినుకొండ టౌన్ పీఎస్ నందు విధులు నిర్వర్తిస్తూ ది.22.05.2025 వ తేదీన HG 209 K.వెంకట సుధాకర్ అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది.
అందుకు గాను
K.వెంకట సుధాకర్ కుటుంబానికి
హోంగార్డు లు అందరూ వారి ఒక రోజు వేతనం మొత్తం రూ. 5,00,000/- సాయం చేసారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ. 5,00,000/- చెక్కును K.వెంకట సుధాకర్ భార్య అయిన ఉమాదేవి కి జిల్లా ఎస్.పి కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ చేతుల మీదుగా అందచేశారు.
సాటి హోంగార్డ్ లకు సాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పల్నాడు జిల్లా హోమ్ గార్డులను ఎస్పి అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ తో పాటు ఏ.ఆర్ డిఎస్పి మహాత్మా గాంధీ రెడ్డి హోంగార్డు ఆర్.ఐ S.కృష్ణ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







