నారద వర్తమాన సమాచారం
అవార్డును అందుకుంటున్న గురజాల అప్పారావు
గురజాల అప్పారావుకు “తెలుగు వెలుగు మహానంది” జాతీయ పురస్కారం
మాచర్ల :
సామాజిక స్పృహతో పలు సేవలు అందిస్తున్న గురజాల అప్పారావుకు తెలుగు వెలుగు మహానంది జాతీయ పురస్కారం లభించింది.
అంతర్జాతీయ తెలుగు భాష సాహితీ సాంస్కృతిక ఉత్సవాలలో భాగంగా హైదరాబాదులోని చిక్కడపల్లి త్యాగరాయ గాన కళామందిరం వేదికపై తెలంగాణ స్టేట్ బీసీ కమిషన్ వకులాభరణం కృష్ణమోహన్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా గురజాల అప్పారావు మాట్లాడుతూ తన సేవలను గుర్తించి తెలుగు వెలుగు మహానంది పురస్కారం అందజేయడం సంతోషకరమన్నారు. ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రతి ఒక్కరూ సేవ భావంతో సమాజ సేవకు ముందుకు రావాలన్నారు. అనంతరం అవార్డు గ్రహీత గురజాల అప్పారావును పలు ప్రజా సంఘాల నాయకులు అభినందించారు. కార్యక్రమంలో పొన్నెకంటి శ్రీనివాసాచారి, పోలోజు రాజ్ కుమార్, అద్దంకి నాగరాజు, డాక్టర్ మండలి లక్ష్మణ బాబు, డాక్టర్ వంగాల శాంతి కృష్ణ ఆచార్య, బ్రహ్మశ్రీ దైవాజ్ఞ శర్మ, బండ కార్తికేయ రెడ్డి, డాక్టర్ వేములవాడ మదన్ మోహన్, మన్నె నాగమల్లేశ్వరి, గంట రజనీ రెడ్డి, అప్పినపల్లి భాస్కరాచారి, పోకూరి లక్ష్మణాచారి, పొడిచెట్టి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







