నారద వర్తమాన సమాచారం
సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ లో భాగంగా విద్యుత్ శాఖ అవగాహన ర్యాలీ
దాచేపల్లి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ లో భాగంగా శనివారం ర్యాలీ జరిపారు. ఈ ర్యాలీలో పీఎం సూర్యఘర్ ఉపయోగాలు, ప్యానెల్స్ మీద అందించే సబ్సిడీ, సూర్య శక్తి వినియోగం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. పునరుత్పాదక శక్తి పరికరాలపై 12 శాతం నుండి 5 శాతం తగ్గింపు, ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు 2 కిలోల వాట్స్ ఉచితం, బీసీ వినియోదాలకు సబ్సిడీ ఉందని సబ్ డివిజన్ ఇంజనీర్ తెలిపారు. ఈ ర్యాలీలో డి ఈ ఈ టీ. వీరేశ్వర రావు, ఏ ఏ ఓ. పి. సందీప్ కుమార్, దాచేపల్లి పట్టణ ఏఈ భగవాన్ నాయక్, రూరల్ ఏ ఈ డి. నాగేశ్వరరావు, సబ్ డివిజన్, ఈ ఆర్వో ఉద్యోగులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







