Wednesday, December 3, 2025

విశ్వకర్మ మయం జగత్.

విశ్వకర్మ మయం జగత్.

నారద వర్తమాన సమాచారం

సర్వదేవతాత్మకుడు విశ్వకర్మ పరాత్పరుడు ఒక్కడే.

యేషదేవో విశ్వకర్మ మహాత్మ సదా జనానం హృదయే సన్ని విష్టః వృధా మనీషా మనసోభీ క్లుప్తాయ ఏ తద్విదు రమ్రుతాస్తే భవంతి వేదం ఏం చెబుతుంది.   కొంతవరకు తెలుసుకుందాం.వైశ్వ కర్మణు లు అన్న పదం వేదం లో 71 సార్లు కనబడుతుంది. ఓం కానీ, నారాయణ అన్న పదం కానీ కనబడవు. సృష్టికర్త విశ్వకర్మ. నిరాకారుడై జలమును సృష్టించి వాయువును, అగ్నిని సృష్టించి వరాహరూపంగా జలము నుండి భూమిని బెలుపలకు తీసుకువచ్చి తానే ప్రజాపతి అయినాడు. ఈ సకల చరాచర సృష్టి ఏదో ఆ అద్భుత శక్తి పరమాత్మ విశ్వకర్మ. మన పురాణ ప్రవచన కారులు ఈ విషయాన్ని ఒక్కసారి కూడా చెప్పరు ఎందుకు. మొదటి ప్రజాపతి భువన విశ్వకర్మ, ఈయన కుమారుడుభౌన విశ్వకర్మ ఈయన తపస్సు చేసి విశ్వకర్మను దర్శించుకున్నారు. ఆయన దర్శించుకున్న రోజు విశ్వకర్మ ఆవిర్భావ దినంగా విశ్వకర్మ యజ్ఞాన్ని జరుపుకుంటున్నాము. అయితే భూమిపై ఉన్న మనుషులందరూ కృతజ్ఞతగా జరుపుకోవాలి కదా? ఇక్కడ దేవతల గురించి తెలుసుకుందాము. 33 కోట్ల దేవతలు అంటున్నారు వేద అర్థం ప్రకారం కోటి అంటే ఒక వర్గం. ఆ 33 దేవతలు ఎవరు తెలుసుకుందాము. అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ప్రజాపతి, ఇంద్రుడు ఈ 33 దేవతలుగా చెప్పబడుచున్నారు. అష్ట వసువులు అనగా, నీరు, గాలి, నిప్పు, సూర్యుడు,చంద్రుడు,నక్షత్రాలు, ఆకాశము వసువు అనగా తాను ఉండి మనలను ఉండనిచ్చేది ఈ 8 మంది మనకు కనిపించే దేవతలు. ఏకాదశ రుద్రులు 11 రుద్రులు మన శరీరంలోనే ఉన్నారు.వారు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఒక ఆత్మ. ద్వాదశ ఆదిత్యులు వారుమిత్ర,రవి,సూర్య, భానుడు, కాగా, పూష్ని, హిరణ్యగర్బుడు, ఆదిత్య, సవిత్రు, ఆర్షా,భాస్కర. వీరు 12 నెలలకు అధిపతులుగా ఉన్నారు. ప్రజాపతి,ఇంద్రుడు. యుద్ధాలకు వెళ్లినప్పుడు సహాయంగా అతిబల పరాక్రమవంతుడైన విష్ణువు వెళ్లేవాడు. అందుకే ఈయనను ఉపేంద్రుడు అంటారు. ఇంతవరకు దేవతలుగా అనుకుంటే అసలు మనిషికి కావలసినది ఏమిటి? గాలి, నీరు, ఆహారం, కట్టుకునేందుకు బట్టలు, ఉండేందుకు ఇల్లు. గాలి నీరు ఆ పరమాత్మే ఇచ్చాడు. విశ్వకర్మ వారసులై మనం అన్నం తినాలంటే పంట పండించాలి. అంటే నాగలి కావాలి. ఇక్కడ విశ్వకర్మ వారసులైన వైశ్వ కర్మణు ల గురించి మనం తెలుసుకుందాము. సానగా బ్రహ్మ ఋషి, సనాతన బ్రహ్మ ఋషి, ప్రత్నస బ్రహ్మ ఋషి, సువర్ణబ్రహ్మ ఋషి, అహభూన బ్రహ్మ ఋషి వీరు పంచ బ్రహ్మలు. పంట పండించటానికి రైతుకు నాగలని సృష్టించి ఇచ్చాడు దారుశిల్పి అయిన వైశ్వకర్మణుడు. సాలీలుకు మగ్గము, కుమ్మరికి సారే. గృహోపకరణములు అనేకం సృష్టికర్తలు, మార్గదర్శకులు. అయోశిల్పి వీరి గురించి చెప్పాలంటే ఏ యంత్రాలు లేని కాలంలో వట్టి పాదాలతో నడిచి ఆ పాదాలకు తగిలే స్పర్శ వల్ల ఇనుము ఉంది అని గ్రహించి మట్టి నుంచివేరు చేసి వస్తువులుగా మలచి న వారు సైనికుడికి కత్తి డాలు, బరిసె తయారు చేయడమే కాదు యుద్ధ విద్యను నేర్పించిన వారు ఉన్నారు ద్రోణాచార్యులు. ఇక శిలా శిల్పులు. వీరి గొప్పతనం చెప్పాలంటే నా అనుభవం సరిపోదు. ఉదాహరణకు పూరి జగన్నాథుడి గుడి పై ఎగరవేసే జెండా గాలి ఒక ప్రక్కకు వేస్తే జెండా ఎదురు ఎగురుతుంది అంట గుడి నీడ కింద పడదు, సముద్రం ఘోష లోపలకు వినపడదు . ఇది శిలా శిల్పుల ఘనత. పద్మనాభ గుడి అయినా, తిరుపతి వెంకన్న స్వామి గుడి అయినా బృహదీశ్వరాలయమైన శిలా శిల్పులు నిర్మించినవే ఆ గుడులను దర్శించినప్పుడు చేతులు ఎత్తి మ్రొక్కడం తప్ప పొగడడానికి మాటలు సరిపోవు అది శిలా శిల్పుల గొప్పతనం ఆ గుడి విప్రునికి భుక్తి. విప్రుల బ్రతుకుతెరువుకు శిలా శిల్పి ఆధారము అయినాడు. కంచర శిల్పము. వీరిని లోహసిల్పులు అంటారు ఇవాళ స్టీలు గిన్నెలు సత్తు గిన్నెలు వాడుతున్నాం. రాగి ఇత్తడి కంచు ఈ పాత్రలు వాడేవారు. అన్నం వండుకుని తినే ప్రతి ఒక్కరికి వీరు అవసరమే. వీరు వైశ్వ కర్మణులు . ఇంకా స్వర్ణ శిల్పులు వీరు తెలియని వారు ఉండరు ఒక తాళిబొట్టు వీరి చేతితో చేసి ఇచ్చేటప్పుడు ఈ దంపతులు కలకాలం కలిసి ఉండాలని విశ్వకర్మ అయిన పరమాత్మను వేడుకొని తాళిబొట్టును ఆశీర్వదించి ఇస్తారు. అందుకే దంపతులు ఎంతోకాలం కలిసి సుఖ సంతోషాలతో ఉండేవారు. వైశ్వకర్మనుని గురించి చరిత్రలో ఏ శిల్పాన్ని అడిగినా చెబుతుంది. పురాణాన్ని ప్రచారం చేసే ప్రవచన కారులకేం తెలుసు విశ్వకర్మ గురించి.  

ఉలి సుత్తి పట్టుకున్న ప్రతి ఒక్కరూ విశ్వకర్మనా?

రాజులు,రాజ్యాలు, మంత్రులు, పదవులు,  కాలగర్భంలో కలిసిపోతాయి. విశ్వ బ్రాహ్మణుల వైభవం ఎప్పటికీ చరిత్రలో ఉంటుంది. దానిని మార్చడం అసంభవం. మనుషులు ఇలా బ్రతకండి అని మార్గాన్ని నిర్దేశించిన వారు విశ్వకర్మ ఆత్మ పుత్రులు, అనుయాయులు విశ్వకర్మను అనుసరిస్తున్న వైశ్వ కర్మణులు రుణం తీర్చుకోలేని దయ నీ ఘనత విశ్వకర్మకు కృతజ్ఞతగా ఉండాలా అక్కరలేదా అనేది మీ ఇష్టం వ్యాసం వశిష్ట నత్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం.

ఈ వ్యాసుల వారు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి అష్టాదశ పురాణాలను రచించినారు. వేద ఉపనిషత్ సారం భగవద్గీత వేద స్వరూపం పరమాత్మ విశ్వకర్మ.

నమో వైశ్యకర్మణే


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version