నారద వర్తమాన సమాచారం
తెలంగాణ 33 జిల్లాల కలెక్టరేట్లో ఈనెల 9న తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు!
33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోనే టెండర్లు ఆహ్వానించింది. మాజీ ప్రధానమంత్రి సోనియా గాంధీ, పుట్టిన రోజు డిసెంబర్ 9న సచివాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహం నమూనా లోనే ఈ విగ్రహాలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.
10 అడుగుల ఎత్తులో విగ్రహం, బేస్‌మెంట్ 4 అడుగులు, విగ్రహం కింద ఉండే 2 అడుగుల పీఠంతో కలిపి మొత్తం 16 అడుగుల ఎత్తు ఉండనుంది. ఒక్కో దానికి ₹17.5 లక్షల చొప్పున ఖర్చు కానుండగా, 33 జిల్లాలకు ₹5.77 కోట్లు అవుతుంది. తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి.
గత ఐదారు నెలలుగా విగ్రహాల ప్రతిష్టాపన పనులు ముమ్మరంగా నడుస్తుండగా చివరి దశకు చేరాయి. రాష్ట్ర సంస్కృతిక చిన్నమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గత ఏడాది డిసెంబర్ 9న రాజధాని హైదరాబాద్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆవిష్కరించారు.
ఈ నేపథ్యంలోనే 33 జిల్లా లోని కలెక్టర్ ఆవరణలోను ఈ నెల 9న తెలంగాణ తల్లి దినోత్సవ సందర్భంగా ఈ విగ్రహాలను ఆవిష్కరించా లని నిర్ణయించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







