బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రేస్ యూత్ నాయకులు పుట్టల జానయ్య
వేములపల్లి నారద వర్తమాన సమాచారం
ప్రతినిధి : బందనకంటి శంకర్
వేములపల్లి మండల కేంద్రానికి చెందినటువంటి మాజీ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కాంగ్రేస్ సీనియర్ నాయకుడు పుట్టల జానయ్య పార్టీకి రాజీనామా చేసి ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన అధికారం వచ్చిన నాటినుండి స్థానిక నాయకులు పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురి అయ్యి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు మండల బీఆర్ఎస్ నాయకుడు చిర్రా మల్లయ్య యాదవ్,గ్రామ శాఖ అధ్యక్షుడు నాగవెల్లి శంకర్, సర్పంచి అభ్యర్థి పుట్టల సందీప్,దైద జాన్సన్,పుట్టల పౌలు, దైద రాజు, మాతంగి సుధీర్, గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









