Wednesday, February 18, 2026

752 ఓట్ల మెజారిటీతో కౌన్సిలర్ గా గెలుపొందిన ఎర్రమళ్ళ దినేష్

752 ఓట్ల మెజారిటీతో కౌన్సిలర్ గా గెలుపొందిన ఎర్రమళ్ళ దినేష్

ఈ తరం నవతరం యువ నాయకుడు – ఎర్రమళ్ల దినేష్

అన్నా అంటే నేనున్నా అంటున్న దినేష్

పట్టణంలోనే 752 మెజారిటీతో కౌన్సిలర్ గా గెలుపు

నారద వర్తమానసమాచారం / మిర్యాలగూడ/ ఫిబ్రవరి 18 నల్గొండ జిల్లా ఇంచార్జ్ :శంకర్

ఎర్ర మళ్ళ పాపయ్య -పద్మ దంపతులకు లకు 1989 సెప్టెంబర్ 27న మొదటి సంతానంగా జన్మించాడు. ఒక తమ్ముడు రాకేష్, ఒక చెల్లె, ఒక కుమారుడు కూడా ఉన్నాడు
మిర్యాలగూడ పట్టణంలోనే బకలవాడ స్కూల్ లో పదో తరగతి వరకు – ఇంటర్మీడియట్ సాయి శ్రీ కాలేజ్, డిగ్రీ శాంతినికేతన్ కాలేజీలో విద్యనభ్యసించాడు. అనంతరం రాజకీయాల్లో టిఆర్ఎస్ లో పార్టీలో చేరి పట్టణ యువజన విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు అనంతరం పేద ప్రజల ఆశాజ్యోతి గా, యువ నాయకుడుగా అనేక సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చేశాడు. ప్రతి ఇంటి మనిషిగా గడపగడపకు తెలిసిన వ్యక్తిగా అన్న అంటే నేను ఉంటున్నా అనే రీతిలో జనజీవనం సాగించాడు. మిర్యాలగూడలో ఇతను అంటే తెలియనివాళ్లు ఎవరూ లేరు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో 19 వ వార్డును బరిలో నిలిచాడు. బీసీ జనరల్ గా ప్రజల కోసం సేవ చేసేందుకు రంగంలో దిగి ఎర్రమళ్ల దినేష్ ఈ ప్రాంత ఓటర్లు సుమారు752 పట్టణంలోనే ఒక మంచి మెజారిటీగా సాధించాడు. కాగా సోమవారం నాడు మున్సిపల్ కౌన్సిల్ గా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. నిరంతరం పేద ప్రజలకు యువకులకు అండగా ఉంటానని అన్నారు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version