నారద వర్తమాన సమాచారం
మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గురజాల శాసనసభ్యులు యరపతినేని….
యువగళంపాదయాత్రలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీల్లో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే యరపతినేని
శ్రీ పరాభవనామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10,060ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సందర్భంగా, శుక్రవారం సాయంత్రం పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురజాల నియోజకర్గం తరుపున గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు కి, ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్.టి.జి.ఎస్ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, నారా లోకేష్ చిత్రపటానికి పాలభిషేకం చెయ్యటం జరిగింది.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కళ్ళం రాజశేఖర్ రెడ్డి వివిధ హోదాలో ఉన్నటువంటి కూటమి నాయకులు మహిళలు యువకులు ఉద్యోగస్తులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









