Tuesday, April 7, 2026
spot_img

నటి సుభాషిని ఆత్మహత్య?

నారద వర్తమాన సమాచారం

నటి సుభాషిని ఆత్మహత్య?


తమిళ బుల్లితెరపై తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి సుభాషిణి (36) బలవన్మరణానికి పాల్పడటం సినీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. చెన్నైలోని పోరూరులో ఉన్న ఒక ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీలంకకు చెందిన సుభాషిణి, బెంగళూరుకు చెందిన పిప్పిన్‌ను వివాహం చేసుకున్నారు. వృత్తిరీత్యా షూటింగ్‌ల కోసం ఆమె చెన్నైలో ఒంటరిగా నివసిస్తుండగా, భర్త బెంగళూరులో ఉంటున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఆదివారం రాత్రి సుభాషిణి తన భర్త పిప్పిన్‌తో వీడి యో కాల్‌లో మాట్లాడారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, వీడియో కాల్ ముగిసిన వెంటనే ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

భర్తతో ఉన్న కుటుంబ కలహాలే ఆమె ఆత్మహత్య కు ప్రధాన కారణమని ఆమె స్నేహితులు కూడా పోలీసులకు తెలిపారు. సుభాషిణి కేవలం నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో చురుకుగా ఉండేవారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కయల్’ సీరియల్ ద్వారా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో కథానాయికగా కూడా నటించిన ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది.

నిరంతరం షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒత్తిడి ని భరించలేక ఆమె తను వు చాలించడం అభిమా నులను కలిచివేస్తోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోరూర్ పోలీసులు వెంట నే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, అనుమానా స్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె సెల్ ఫోన్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నా రు. వీడియో కాల్‌లో అసలు ఏం జరిగింది? ఏ విషయమై గొడవ పడ్డారు? అనే కోణంలో పోలీసులు పిప్పిన్‌ను కూడా విచా రించే అవకాశం ఉంది. మంచి భవిష్యత్తు ఉన్న నటి చిన్న వయసులోనే అర్థాంతరంగా తనువు చాలించడం పట్ల తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading