నారద వర్తమాన సమాచారం
భవన నిర్మాణ కార్మికులు పేర్లు నమోదు చేసుకోవాలి: కలెక్టర్ కృతిక శుక్ల
పల్నాడులో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కార్మికులు సమీప కార్మికశాఖ కార్యాలయాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు తప్పనిసరిగా నమోదు చేసుకొని గుర్తింపు కార్డు పొందాలని సూచించారు. నమోదు చేసిన కార్మికులకు వివిధ సంక్షేమ పథకాల కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








