నారద వర్తమాన సమాచారం
మాజీ డీజీపీ భార్య దారుణ హత్య?
హైదరాబాద్ నగరం నడిఒడ్డున్న ఉన్న జూబ్లీహిల్స్ శుక్రవారం తెల్లవారు జామున దారుణ ఘటన వెలుగు చూసింది. ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్‌లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య సునంద,తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారంతో ఘట నా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదే హాన్ని స్వాధీనం చేసు కొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలిం చారు. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
క్లూస్ టీమ్ సహాయం లో ఘటనా స్థలంలోని వేలిముద్రల సేకరిస్తు న్నారు. అయితే ఈ దారుణానికి,పాల్పడింది,నేపాలి గ్యాంగ్ అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్, మీడియాకు వెల్లడించారు.ఇంట్లో పని మనిషి కల్పన అనే నేపాల్‌కు చెందిన మహిళ గత 8 నెలలు గా ఇంట్లో పని చేస్తుం దని.. ఆమె పథకం ప్రకారంమరి కొందరితో కలిసి సునందను హత్య చేసినట్టు పోలీ సులు గుర్తించారు.
సునంధ ఇంట్లో ఒం టరిగా ఉన్న సమయం చూసి కల్పన తమ గ్యాంగ్‌కు సమాచారం ఇచ్చిందని.. దీంతో అక్కడికి చేరుకున్న నలుగురి వ్యక్తులతో కలిసి సునందను హత్య చేశారని.. అనంతరం ఇంట్లో ఉన్న నగదు, బంగారం తీసుకొని అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు ప్రాథమికం గా నిర్థారణకు వచ్చా రు. నిందితులను త్వ రగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








