నారద వర్తమాన సమాచారం
ఎబోలా వైరస్ వ్యాప్తిపై డబ్ల్యూ హెచ్ ఓ హెచ్చరిక
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ ) ఎబోలా వైరస్ వ్యాప్తిపై అప్రమత్తం చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ఈ నేపథ్యంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి (హెల్త్ ఎమర్జెన్సీ )ని ప్రకటించింది.
ప్రస్తుతం డెమోక్రటిక్ రిపబ్లిక్ అఫ్ ది కంగో మరియు యుగండ దేశాల్లో ఎబోలా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 300కు పైగా కేసులు నమోదైనట్లు డబ్ల్యూ హెచ్ ఓ వెల్లడించింది.
ఎబోలా ఒక తీవ్రమైన వైరల్ వ్యాధి. ఇది సోకిన వ్యక్తుల శరీర ద్రవాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. జ్వరం, వాంతులు, విరేచనాలు, అంతర్గత మరియు బాహ్య రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వ్యాధి నియంత్రణ కోసం బాధిత ప్రాంతాల్లో వైద్య బృందాలు, పరీక్షలు, క్వారంటైన్ చర్యలను డబ్ల్యూ హెచ్ ఓ ముమ్మరం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








