నారద వర్తమాన సమాచారం
హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు..
రూ.5.88 కోట్ల అక్రమ ఆస్తులు వెలుగులోకి!
హైదరాబాద్‌లోని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ (జలమండలి) ప్రాజెక్ట్ డివిజన్-8 జనరల్ మేనేజర్ (ఇంజినీరింగ్) ఎస్.ఏ.ఎల్. కుమార్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. తనకు తెలిసిన ఆదాయ వనరులకు మించి అవినీతి, అనుమానాస్పద మార్గాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసు నమోదైనట్లు ఏసీబీ వెల్లడించింది.
మంగళవారం ఏసీబీ అధికారులు కుమార్ నివాసంతో పాటు అతని బంధువులు, స్నేహితులు, బినామీలు సహా మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ స్థాయిలో ఆస్తులు బయటపడినట్లు అధికారులు తెలిపారు.
సోదాల్లో నిజామాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో కలిపి 18 ఎకరాల వ్యవసాయ భూమి, 6 ఓపెన్ ప్లాట్లు, హైదరాబాద్‌లో 3 ఫ్లాట్లు, ఒక ఇల్లు గుర్తించారు. అలాగే ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు, సుమారు 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవే కాకుండా ఒక మారుతి రిట్జ్ కారు, ఒక బజాజ్ మోటార్ బైక్ కూడా గుర్తించినట్లు ఏసీబీ పేర్కొంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








