కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి!
నారద వర్తమాన సమాచారం
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగి.. ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు.
సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. భార్య, కుమార్తె, అల్లుడు, మనవడు అంతా గణపతి పూజలో పాల్గొన్నా రు.వాడవాడలా ఏర్పాటు చేసే వినాయక మండపా ల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించు కోవాలని ప్రజలకు ముఖ్యమంత్రి సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








