నారద వర్తమాన సమాచారంపర్యావరణ హితం కోరే ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేయాలి:దేవిరెడ్డి సుధీర్ రెడ్డిఎల్ బీ నగర్పర్యావరణ హితం కోరే ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేయాలనీ ఎల్ బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి సూచించారు.శనివారం రాబోయే వినాయక చవితి సంధర్భంగా పీఅండ్ టీ కాలనీ నందు గణేష్ యువభక్త మండలి ఆధ్వర్యంలో దాదాపు 39 ఫీట్ల మట్టి గణపతి నిర్మాణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు నిర్మించే వినాయక ప్రతిమ పోస్టర్ ఆవిష్కరించారు.అనంతరం సుదీర్ రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలతో పర్యావరణానికి హాని జరుగుతుందన్నారు.నియోజకవర్గ పరిధిలోని 934 కాలనీల నందు సుమారు 90,000 ఇండ్లలో గణపతిని పూజించేవారంతా.మన పురాతన,శాస్ట్రోతమైన సంప్రదాయ మట్టి వినాయకులను పూజించాలని,రసాయన రంగులతో కూడిన ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలు నీటిలో కరగవు.అదే మట్టితో చేసిన విగ్రహాలు అయితే వెంటనే రెండు లేదా మూడు గంటలలో కరగడం జరుగుతుంది.పర్యావరణ హితం కోరే ప్రతి ఒక్కరు మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.మనలో ప్రతి ఒక్కరు మట్టి గణపతి విగ్రహాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి అని అన్నారు.ప్రతి ఒక్కరు ఈ పండుగ రోజు మట్టి వినాయక విగ్రహాలు ఇంట్లో ఏర్పాటు చేసుకొని పర్యావరణాన్ని కొంత మేర కాపాడాలని కోరారు.మన పూర్వీకులు చెరువు మట్టితో వినాయక విగ్రహాన్ని తయారుచేసి తిరిగి అదే చెరువులో నిమజ్జనం చేసేవారని,మన పండుగల్లోని పరమార్థం.మన ఆరోగ్యం,ప్రకృతిని కాపాడుకోవడమేనని తెలిపారు.కావున రాబోయే వినాయక చవితి సందర్భంగా మేము చేసే సూచన ఏమిటంటే కాలనీ సంక్షేమ సంఘాలు,అపార్టుమెంట్లు,యువజన సంఘాల వారు మీరు ప్రతిష్టించే విగ్రహాలు మట్టి విగ్రహాలుగా ఎంచుకొని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కోరారు.కావున ప్రతి ఒక్కరు రాబోయే రోజుల్లో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తాము చేపడుతున్న కార్యక్రమాలు సహృదయంతో స్వీకరించి ఆచరించినప్పుడే అన్నివిధాలా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అని అన్నారు.రాబోయే రోజుల్లో వీరిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలనికోరారు.ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు బిచేనేపల్లి వెంకటేశ్వరరావు,మాజీ కార్పొరేటర్లు భవాని ప్రవీణ్ కుమార్,రమేష్ ముదిరాజ్,శ్రీశైలం యాదవ్,రవీందర్ రెడ్డి,యాద శంకర్,సభ్యులు నారాయణ రావు,నాగేష్ యాదవ్,రాంకుమార్ రాజు,కర్ణ శ్రీనివాస్,శేఖర్ యాదవ్,శ్రీనివాస్ యాదవ్,కిరణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి,స్వామి యాదవ్,జ్ఞానేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.