Saturday, October 17, 2026
spot_img

మాచర్ల రూరల్ ఎస్సైగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వి.వెంకటేశ్వరావు

నారద వర్తమాన సమాచారం

మాచర్ల రూరల్ ఎస్సైగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వి.వెంకటేశ్వరావు

వి.వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించిన గురజాల అప్పారావు ప్రజా సంఘాల నాయకులు

ఇటీవల మాచర్ల రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన
వి వెంకటేశ్వరరావును శనివారం రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రజాసంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను శాలవాలతో ఘనంగా సత్కరించి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ పార్ట్ వెల్ఫేర్ ఎవర్నెస్ ఆర్గనైజేషన్ మాట్లాడుతూ
మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ కు యంగ్ డైనమిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా వి వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టటం గర్వంగా ఉందని ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మాచర్ల రూరల్ స్టేషన్ పరిధిలోనే శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలకు పోలీసులకు మధ్య స్నేహపూరక సంబంధాలు ఉండే విధంగా చూడాలని, ఎస్సీ ఎస్టీలపై దాడులు ,అత్యాచారాలు జరిగినప్పుడు రిపోర్టు ఇచ్చిన వెంటనే ఎఫ్ ఐ ఆర్ అయ్యేలా చూడాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, గ్రామాల్లో బీసీలు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ ఈబీసీలు వర్గాల ప్రజలు నివసించే ప్రాంతంలో యువత చెడు వ్యసనాలకు
లోన్అవుతున్నారని
వారు అసాంఘిక కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్నారని ,అందుచేత పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అటువంటి ప్రాంతంలో చట్టాల పట్ల అవగాహన కలిగే విధంగా యువతను చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని,
ప్రతి నెల చివరి వారంలో గ్రామాలలో నిర్వహించే పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమంలో పోలీసు వారు హాజరయ్యే విధంగా చూడాలని సమస్యలను పరిష్కరించాలని ఆయనను కోరారు.
సమస్యల పట్ల ఎస్సై వెంకటేశ్వరరావు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలియజేశారని అనంతరం

ఎస్సై వెంకటేశ్వరావును సత్కరించి అభినందనలు తెలియజేసిన వారిలో పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ మరియు దళిత బహుజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఒక మూడు ప్రసాద్
దళిత బహుజన భీమ్సేన రాష్ట్ర అధ్యక్షులు
పేరుపోగు జార్జి,
బిసి నవ చైతన్య వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు బొడ్డుపల్లి ఈశ్వరయ్య, మాచర్ల నియోజకవర్గం అధ్యక్షులు గారే చిన్న మల్లయ్య తదితరులు ఉన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version