నారద వర్తమాన సమాచారం
జనన మరణాల ఆలస్య నమోదుకు వాస్తవిక నిర్ధారణ తప్పనిసరి
జనన, మరణాలకు సంబంధించి ఏడాది నుంచి రెండేళ్లలోపు ఆలస్య నమోదుకు సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్ ఆర్డీఓ తహసీల్దారు వాస్తవిక నిర్ధారణ ఉత్తర్వులను అనుసరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు కేంద్ర గెజిట్ ఉటంకిస్తూ జనన, మరణాల నమోదు చట్టంలోని సెక్షన్-13లో నిబంధనలను సవరిస్తూ సీఎస్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
రెండేళ్ల తర్వాత ఆలస్యంగా సమాచారం అందితే ఆ ప్రాంతంపై అధికార పరిధి కలిగిన ఫస్ట్ క్లాస్ జ్యుడి షియల్ మేజిస్ట్రేట్ వాస్తవికతను పరిశీలించి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నమోదు చేయాల్సి ఉంటుంది. అవసరమైనచోట చట్టప్రకారం నియమించిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లకు అధికారాలు కల్పించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ఈమేరకు సాఫ్ట్ వేర్, పనివిధానాల్లో మార్పులు చేయాలని సీసీఎల్ఎను ఆదేశించారు….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








