నారద వర్తమాన సమాచారం
ఎన్టీఆర్ జిల్లాలో ఏ.కొండూరులో పులి సంచారం.. పవన్ కీలక ఆదేశాలు….!
ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు పరిసరాల్లో పులి సంచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. థర్మల్ డ్రోన్లు, ఏ ఐ కెమెరా ట్రాప్లతో పులి కదలికలను గుర్తించాలని ఆదేశించారు. హనుమాన్ బృందాలతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాల నిపుణుల సేవలు వినియోగించుకోవాలని తెలిపారు. పులికి, ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








