Monday, June 9, 2025

నిరంతరం ప్రజా రక్షణకై పాటుపడే పోలీస్ సిబ్బందికి అండగా ఉంటాం – పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) జె వి. సంతోష్…

నారద వర్తమాన సమాచారం

నిరంతరం ప్రజా రక్షణకై పాటుపడే పోలీస్ సిబ్బందికి అండగా ఉంటాం – పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) జె వి. సంతోష్…

పల్నాడు జిల్లా కు చెందిన HG 467 T.V.K. బాజీ అను హోంగార్డు డిప్యుటేషన్ మీద వైజాగ్ స్టీల్ ప్లాంట్ నందు విధులు నిర్వహిస్తూ ఈ రోజు ఉద్యోగ విరమణ చేయడం జరిగింది .

వారిని అడ్మిన్ ఎస్పీ  పూలమాలతో, దుశ్శాలువాతో సత్కరించడం జరిగింది.

అదే విధంగా ది.21.01.2025 వ తేదీ తేదీ కమ్యూనికేషన్ నందు పనిచేస్తూ రిటైర్డ్ అయిన HG 83 J. చెన్న అను అతనికి అడిషనల్ ఎస్పీ J.V. సంతోష్  చేతుల మీదుగా 5,00,000/- రూపాయల చెక్కును అందించడం జరిగింది.

హోంగార్డు సిబ్బంది యొక్క సమస్యలను, కనీస అవసరాలను ఎప్పటికప్పుడు ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్న హోమ్ గార్డు RI S. కృష్ణ ని అదనపు ఎస్పీ అభినందించినారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ JV సంతోష్ తో పాటు RI S.కృష్ణ  పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading