నారద వర్తమాన సమాచారం
మాచర్ల నిందితుడ్ని త్వరగా అరెస్ట్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం
మాచర్ల పట్టణంలో ఓ ప్రభుత్వ ఉద్యగినిపై ఆగంతకుడు అత్యాచార యత్నం చేసిన ఘటనలో త్వరితగతిన నిందితుణ్ని అరెస్టు చేయాలని సీఎం చంద్రబాబు పోలీసు అధికారులను ఆదేశించారు. పంచాయితీరాజ్ శాఖలో కార్యాలయ సబార్డినేట్‌గా పనిచేస్తున్న మహిళ ఇంట్లోకి ఒక అగంతకుడు చొరబడి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించినట్టు అధికారులు వివరించారు. అదనపు ఎస్పీ నేతృత్వంలో నిందితుణ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని చెప్పాలని సీఎం ఆదేశించారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








