నారద వర్తమాన సమాచారం
జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్
నరసరావుపేట: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్ నరసరావుపేట పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం, ఆర్డీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద చేపట్టిన పోలీసు భద్రతా ఏర్పాట్లను, బందోబస్తు విధులను సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నామినేషన్ల దాఖలు కోసం వచ్చే అభ్యర్థులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించేలా చూడాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా సమన్వయంతో పనిచేయాలని పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు.
Hiఈ కార్యక్రమం లో అడిసినల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి IPS , నరసరావుపేట ASP M. హనుమంతరావు , నరసరావుపేట 1టౌన్ CI ఫిరోజ్ , నరసరావుపేట ట్రాఫిక్ CI లోకనాథ్ , ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








