Friday, November 22, 2024

చండ్రాజుపాలెం లో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు కండువా కప్పి ఆహ్వానించిన :ఎమ్మెల్యే  నంబూరు శంకరరావు :

ఆంద్రప్రదేశ్

చండ్రాజుపాలెం లో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే  నంబూరు శంకరరావు

నారదవర్తమానసమాచారం:బెల్లంకొండ:ప్రతినిధి

బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం లో టీడీపీకి చెందిన 20 కుటుంబాల వారు.. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు  స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే  నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. గత నాలుగేళ్లలో సీఎం  వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం పేదలకు అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అందిస్తుందన్నారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అందిస్తున్న సంక్షేమం, చేస్తున్న అభివృద్ధి నచ్చి ఎంతోమంది టీడీపీ నుంచి తమ పార్టీలో చేరుతున్నారన్నారు.
ప్రతిపక్షాలు కలలో కూడా ఊహించలేని అభివృద్ధిని ఈ నాలుగేళ్లలో చేశామన్నారు. మరోసారి తనను ఆదరిస్తే.. పెదకూరపాడు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గంలో మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగరేందుకు అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో తిరుమల పెద్ద జానయ్య, చిన్న జానయ్య, వెంకట్రావు, గాదం సంజీవరావు, గాదం రామయ్య, పసుపులేటి వెంకటేష్, పసుపులేటి అనూష, పసుపులేటి రమణ, గొలుసుల సత్యవతి, గొలుసుల నాగమణి తిరుమల సామ్రాజ్యం, భూలక్ష్మి, లక్ష్మి, గాదం శివ పార్వతి, రేటం కోటేశ్వరరావు, గాదం బాజీ, వల్లాల శ్రీకాంత్, తిరుమల మురళీకృష్ణ తదితరులున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version