![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/04/img-20240410-wa04984023518714563790113-1024x682.jpg?resize=696%2C464&ssl=1)
నారద వర్తమాన సమాచారం :బెల్లంకొండ:ప్రతినిధి
వైఎస్సార్సీపీలో చేరిన మన్నెసుల్తానాపాలెం, రామాంజనేయ పురం వాసులు
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
బెల్లంకొండ మండలం మన్నెసుల్తానాపాలెం, రామాంజనేయ పురం గ్రామానికి చెందిన కుటుంబాల వారు ఈ రోజు వైఎస్సార్సీపీలో చేరారు. క్రోసూరు లోని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో టీడీపీ నుంచి భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కలసి పనిచేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని.. ఎవరికి ఏ అవసరమొచ్చినా.. తాను ఉన్నాననే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో రాతల రామకోటి నాయక్,కౌతావత్ బాలునాయక్, మున్నావత్ బాలునాయక్, గుగులోతు గోపి నాయక్,కేతావత్ రాజునాయక్ , కుర్ర వెంకటేశ్వర్లు, భూక్య బాలాజీ నాయక్,రమావత్ జగ్యానాయక్ , భూక్య తులసి నాయక్,గుగులోతు కస్నా నాయక్ ,వర్ల వారియబాబు ,ఏపూరి జగదీష్ ,భూక్యా వెంకటేశ్వర్లు నాయక్ కూడా ఎమ్మల్యే సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వీరిలో టిడిపిలో వెళ్లి తిరిగి వైఎస్ఆర్సిపి లో జాయిన్ అయినవారు వర్ల మరియా బాబు,భూక్యా బాలాజీ నాయక్,రాతల రామకోటి నాయక్ వారు ఎమ్మెల్యే సంక్షేమంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.