కాంగ్రెస్ పార్టీలో చేరిన ఐలాపూర్ సొసైటీ చైర్మన్
. సంక్షేమ పథకాలే చేరికలకు కారణం
. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం
. పి.సి.సి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎం .ఎల్ .సి మహేష్ కుమార్ గౌడ్
నారద వర్తమాన సమాచారం:నిజామాబాద్ జిల్లా,
అర్మూర్,:ప్రతినిధి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల పరంపర కొనసాగుతోంది .గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీ.సీ.సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎం.ఎల్ .సి మహేష్ కుమార్ గౌడ్ ,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సమక్షంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో టి.ఆర్.ఎస్ పార్టీని వీడి ఐలాపూర్ సొసైటీ చైర్మన్ మీసాల సుదర్శన్, మాజీ జెడ్. పి .టి. సి నవీన్ ,మాజీ సర్పంచ్ గంగాధర్, మాజీ ఉప సర్పంచ్ గంగాధర్ ,మూడేడ్ల బాజన్నా ,కొండల భోజన్నా ,టప్పా రవి తదితరులు చేరారు. ఈ సందర్భంగా ఎమ్. ఎల్. సి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో చేసిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరును చూసి వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతుందని వారు అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమ కారుడు ఎం .ఎల్. సి జీవన్ రెడ్డి ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు .జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే తమ ఎజెండా అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల్ అధ్యక్షులు మందమహిపాల్, లిఫ్ట్ చైర్మన్ బోజా రెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు ఇంద్రుడు ,కాంగ్రెస్ నాయకులు సాయినాథ్ గౌడ్ నాగరాజు ఐలాపూర్ రాజు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.