ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధికి నిధులు కేటాయించండి
.సీఎం ను కలిసిన వినతి పత్రం ఇచ్చిన ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు
నారద వర్తమాన సమాచారం
నిజామాబాద్ జిల్లా,
ఆర్మూర్,29.
ఆర్మూర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ గా నియమితులైన వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్ మరియు ఇటీవల టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పై చర్చించుకుని రానున్న పార్లమెంటు ఎన్నికలలో గెలుపు దిశగా అడుగులు వేయాలని చర్చించుకున్నట్లు వారు తెలియజేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మున్సిపల్ నూతన భవనానికి మరియు అభివృద్ధి పనులకు నిధులను కేటాయించాలని మెమోరాండం ఇవ్వటం జరిగింది. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి త్వరలోనే నిధులను కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సంజయ్ సింగ్ బబ్లు మరియు పండిత్ పవన్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా, పట్టణ కౌన్సిలర్లు ఇట్టేడి నర్సారెడ్డి, శాలా ప్రసాద్ ,రవి గౌడ్, ఆకుల రాము, ఎస్ .ఆర్. రమేష్, అధిగ్ ,ఫయాజ్, ఇంతియాజ్ ,కొంత మంజుల మురళి ,వనం శేఖర్, శివ ,డార్లింగ్ రమేష్, తాటి హనుమాన్లు, రంగన్న ,బాదం రాజ్ కుమార్, రింగుల భూషణ్ ,ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబాగౌడ్ ,నాయకులు అజ్జు ,మారుతి రెడ్డి ,రాజు ,రవీందర్ రెడ్డి, జుమ్మి రవి, భూపేందర్ ,హబీబ్ ,మహమూద్ అలీ ,ఎస్ .కె .బబ్లు, శ్రీకాంత్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.