మూడు మొబైల్ షాప్ లపై ఎస్. ఐ కి ఫిర్యాదు
. ఫిర్యాదు చేసిన ఆర్మూర్ మొబైల్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు.
. నాసిరకం వస్తువులను అంటగడుతున్నారని వినతి
నారద వర్తమాన సమాచారం :నిజామాబాద్ జిల్లా ,
ఆర్మూర్,:ప్రతినిధి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ మొబైల్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొబైల్ షాప్ యజమానులు పటేల్ మొబైల్స్, జై రాజేశ్వర్ ,మహాలక్ష్మి మొబైల్స్ వలన తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని నిరసన వ్యక్తం చేస్తూ గురువారం రోజు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని మొబైల్ షాపులను స్వచ్ఛందంగా మూసి వేయడం జరిగింది . ఆ తరువాత యూనియన్ సభ్యులు అందరూ కలిసి ఆర్మూర్ ఎస్ .ఐ కి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పటేల్ మొబైల్, జై రాజేశ్వర్, మహాలక్ష్మి మొబైల్స్ వారు హోల్ సెల్ షాప్ లని చెప్పుకుంటూ రిటైల్స్ షాప్ యజమానులకు హోల్ సెల్ గా అమ్మడం వలన తమ వ్యాపారం దెబ్బతిని దాదాపు 80 షాపులో రోడ్లపై పడే పరిస్థితి వచ్చిందని, అంతేకాకుండా వారు మాకు డూప్లికేట్ వస్తువులను అంటగట్టడం వలన అవే మేము కస్టమర్లకు అమ్ముతున్నామని నాణ్యమైన వస్తువుల పేరిట నాసిరకం వస్తువులను అంటగడుతున్నారని కస్టమర్లు మాపైన అపనమ్మకం పెట్టుకుంటున్నారని, దానితో మా దుకాణ సముదాయాలలోకి కస్టమర్లు రావడం తగ్గిందని వారు ఆపోయారు .ఇదే విషయమై షాపు యజమానులతో పిలిపించి మాట్లాడినప్పుడు వారు మాతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అంటూ అనడం జరిగిందని వారు తెలిపారు .మేము గత 20 సంవత్సరాల నుండి ఇదే వ్యాపారము జీవనంగా కొనసాగిస్తున్నామని ఇది ఇలాగే కొనసాగితే మా కుటుంబాలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉందని ఈ షాపుల పైన చర్యలు తీసుకోవాలని మాకు న్యాయం చేయాలని వారు కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.